Robbery In Vijayawada: విజ‌య‌వాడలో న‌గ‌ల య‌జ‌మానిలో ఇంట్లో దోపిడీ.. న‌కిలీ పిస్తోల్‌తో బెదిరించి..

Robbery In Vijayawada: విజ‌య‌వాడ‌లో భారీ చోరీ జ‌రిగింది. రాహుల్ జువెల‌రీస్ య‌జ‌మానిలో ఇంట్లో జ‌రిగిన ఈ దోపిడీ ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. వివ‌రాల్లోకి వెళితే.. గ‌త‌కొన్ని రోజుల..

Robbery In Vijayawada: విజ‌య‌వాడలో న‌గ‌ల య‌జ‌మానిలో ఇంట్లో దోపిడీ.. న‌కిలీ పిస్తోల్‌తో బెదిరించి..
Robbery In Vijayawada

Updated on: May 31, 2021 | 8:29 AM

Robbery In Vijayawada: విజ‌య‌వాడ‌లో భారీ చోరీ జ‌రిగింది. రాహుల్ జువెల‌రీస్ య‌జ‌మానిలో ఇంట్లో జ‌రిగిన ఈ దోపిడీ ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. వివ‌రాల్లోకి వెళితే.. గ‌త‌కొన్ని రోజుల క్రితం విజ‌యవాడ‌లోని గ‌వ‌ర్న‌రు పేట పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో దోపిడీ జ‌రిగింది.
ప‌ట్ట‌ణంలో ఉన్న హై హింద్ కాంప్లెక్స్‌లో ఉన్న రాహుల్ జువెల‌రీస్ య‌జ‌మాని ఇంట్లో కొంద‌రు గుర్తుతెల‌య‌ని వ్యక్తులు దోపిడీకి పాల్ప‌డ్డారు. ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన ఈ సంఘ‌ట‌న న‌గ‌రంలో సంచ‌ల‌నంగా మారింది. ఇంట్లోకి ప్ర‌వేశించే స‌మ‌యంలో దుండ‌గులు న‌కిలీ పిస్తోల్‌తో మ‌హిళ‌ను బెదిరించి ఇంట్లోకి చొర‌బ‌డ్డారు. అనంత‌రం ఇంట్లో న‌గదు దోచుకొని వెళుతుండ‌గా ఆ స‌మ‌యంలో విధులు నిర్వ‌ర్తిస్తోన్న పోలీసులకు ప‌ట్టుప‌డ్డారు. వారిని విచారించ‌గా.. నిందితులు గుంటూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి ల్యాప్‌టాప్‌తో పాటు, 3 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. కేసుకు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Also Read: Hari Hara Veeramallu: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు పండగే.. సంక్రాంతి బరిలోకి పవర్ స్టార్ సినిమా..

Increased Egg Prices : కొండెక్కిన గుడ్డు ధర..! ఒక్కోటి 6 నుంచి 8 రూపాయలు..? ఎగ్ రేట్లు ఎందుకు పెరిగాయో తెలుసుకోండి..

ఆస్ప‌త్రి బెడ్ మీద ఆమె మెడ‌లో ప‌సుపుతాడు క‌ట్టాడు.. అయినా కాపాడుకోలేకోయాడు