Road accident on National Highway 65: హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై గురువారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎందురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొని మంటలు చెలరేగాయి. దీంతో జాతీయ రహదారిపై గంటలకొద్ది ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 10 కిలోమేటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ సంఘటన నార్కెట్‌పల్లి సమీపంలోని ఏపీ లింగోటం గ్రామం వద్ద చోటుచేసుకుంది. అర్థరాత్రి సమయంలో జాతీయ రహదారిపై ఎదురుఎదురుగా వస్తున్న డీసీఎం, కంటైనర్ ఢీకొని మంటలు చెలరిగినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఇరు వాహనాల డ్రైవర్లకు తీవ్రగాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
కాగా.. లారీలో కేబుల్ వైర్లు ఉండటంతో భారీగా మంటలు చెలరేగాయి. గ్రానైట్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్న లారీ గ్రామంలో నుంచి రోడ్డుపైకి వస్తుండగా.. వేగంగా వస్తున్న డీసీఎం ఢీకొంది. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పారు. రెండు వాహనాలు సైతం పూర్తిగా దగ్ధమయ్యాయి. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కంటైనర్ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ భారీ సంఘటన చోటుచేసుకున్నట్లు గ్రామస్థులు పేర్కొన్నారు.
ఇదిలాఉంటే.. అంబులెన్స్ రాక ఆలస్యం అవ్వడంతో.. జీఎంఆర్ వాహనంలో క్షతగాత్రులను స్థానిక కామినేని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: