Crime News: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. టైర్‌ పేలి బస్సు బోల్తా..

Crime News: మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టైర్‌ పేలి ఓ ప్రైవేట్‌ బస్సు బోల్తాపడటంతో ఇద్దరు మృతి చెందగా 20 మందికి గాయాలయ్యాయి.

Crime News: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. టైర్‌ పేలి బస్సు బోల్తా..

Updated on: Feb 21, 2022 | 8:40 AM

Crime News: మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టైర్‌ పేలి ఓ ప్రైవేట్‌ బస్సు బోల్తాపడటంతో ఇద్దరు మృతి చెందగా 20 మందికి గాయాలయ్యాయి. ఈ ఘోరమైన సంఘటన హైదరాబాద్‌ నుంచి అజ్మీర్ వెళుతుండగా జరిగింది. వివరాలలోకి వెళితే.. మెదర్ జిల్లాలోని హవేలి ఘన్‌పూర్ మండలం దగ్గర ఓ ప్రైవేట్‌ బస్సు రన్నింగ్‌లో ఉండగా ముందు టైర్‌ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో బస్సు అదుపుతప్పి పల్టీ కొట్టడంతో ఇద్దరు స్పాట్‌లోనే మృతి చెందారు.

కాగా బస్సులో ఉన్న 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు అజితా బేగం, దహిగా బేగంగా గుర్తించారు. వీరిద్దరు తల్లీకూతుళ్లుగా నిర్ధారించారు. బస్సులోని వారంతా హైదరాబాద్‌లోని షాద్‌గర్ చెందిన వారిగా గుర్తించారు. గాయపడ్డ వారిని మెదక్‌లోని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని జేసీబీ సాయంతో బస్సుని రోడ్డు పక్కకి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Viral Video: ఔరా..! ఉడుము ఎంత పని చేసింది.. రెస్టారెంట్‌లోకి దూరి మహిళకు చుక్కలు చూపించిన ఉడుము.. వైరల్ అవుతున్న వీడియో..

Andhra Pradesh: టాలీవుడ్‌కు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. పెరగనున్న టికెట్ రేట్లు.. ఇవాళో రేపో జీవో జారీ..

petrol, diesel: ప్రజలకు షాక్ ఇవ్వనున్న పెట్రోలియం కంపెనీలు.. ఎప్పుడంటే..

Loading...
Unable to load recommendations.
Follow Us