Accident: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కారు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పండగ పూట వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం చట్టి వద్ద రాజమహేంద్రవరం వైపు ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళుతుండగా వేగంగా వచ్చిన కారు వెనక నుంచి బలంగా ఢీ కొట్టింది. దీంతో ఎగిరిపడిన ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఇద్దరు వ్యక్తులు చింతూరు మండలం నరసింహాపురం గ్రామానికి చెందిన రామకృష్ణ (26), సీతయ్య(48)గా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
హైదరాబాద్‌లో 36 కిలోల నిషేధిత సింథటిక్ మాంజా పట్టివేత.. అమ్మకపుదారులపై పలు కేసులు నమోదు..