హైదరాబాద్‌లో 36 కిలోల నిషేధిత సింథటిక్ మాంజా పట్టివేత.. అమ్మకపుదారులపై పలు కేసులు నమోదు..

Synthetic Manja Seized: గాలి పటాలు ఎగరవేయడానికి సింథటిక్ మాంజాను వాడొద్దని అధికారులు ఎంత చెబుతున్నా కొంతమంది

  • uppula Raju
  • Publish Date - 2:31 pm, Thu, 14 January 21
36kg synthetic Manja seized in Hyderabad

Synthetic Manja Seized: గాలి పటాలు ఎగరవేయడానికి సింథటిక్ మాంజాను వాడొద్దని అధికారులు ఎంత చెబుతున్నా కొంతమంది విక్రయదారులు పట్టించుకోవడం లేదు. తాజాగా హైదరాబాద్‌లో 187 దుకాణాలను తనిఖీ చేసిన అధికారులు 36 కిలోల నిషేధిత సింథటిక్ మాంజాను స్వాధీనం చేసుకున్నారు. అమ్మకపు దారులపై పలు కేసులు నమోదు చేశారు. జగిత్యాల జిల్లాలో కూడా ఒకరిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి పదివేల విలువైన చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు.

సంక్రాంతి పండగ ద‌ృష్ట్యా చైనా మాంజా అమ్మకాలపై అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. భద్రాద్రి కొత్తగుడెం జిల్లాలో అటవీ అధికారులు అవగాహన కార్యక్రమం చేపట్టారు. అటవీ ప్రాంతంలో అనేక రకాల పక్షులు ఉన్నాయని చైనీస్ మంజా వల్ల వాటికి ప్రమాదం కలుగుతుందని తెలిపారు. ఈ మాంజాలో పక్షులు చిక్కుకుంటే, ప్రాణాలో కోల్పోతాయాని పేర్కొన్నారు. చైనీయుల మాంజాను ఉపయోగించడం లేదా అమ్మడం దొరికితే ఎవరైనా లక్ష రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Man died with Manja : ప్రాణం తీసిన మాంజా దారం.. బైక్ వస్తుండగా గొంతు తెగి యువకుడి మృతి

Chinese manja Banned: చైనా మాంజాపై అటవీ శాఖ నిషేధం.. అమ్మినా.. కొన్నా.. ఏడేళ్ల జైలు శిక్ష..!