Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్‌ను ఢీకొన్న కారు.. ఐదుగురు మృతి.. అంతా హైదరాబాద్‌ వాసులే..

|

Aug 15, 2022 | 8:47 PM

Road Accident: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఇంకా పెరుగుతూనే ఉన్నాయి.

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్‌ను ఢీకొన్న కారు.. ఐదుగురు మృతి.. అంతా హైదరాబాద్‌ వాసులే..
Road Accident
Follow us on

Road Accident: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. మద్యంసేవించి వాహనాలు నడపడం, ఓవర్‌టెక్‌, అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇక తాజాగా కర్ణాటకలోని బీదర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కంటైనర్‌ను కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ప్రమాదం జరగడానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. మృతులు దినేష్‌, గిరిధర్‌, ప్రియ, అనిత, నాయక్‌లుగా గుర్తించారు. మృతులు హైదరాబాద్‌లోని బేగంపేట వాసులుగా గుర్తించారు పోలీసులు. కల్బుర్గి గంగాపురం ఆలయానికి వెళ్లి వస్తుండగా, ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి