Lot of Money: వామ్మో.. ఇతని ఇంటినిండా నోట్ల కట్టలే.. ఇతనొక సాధారణ క్లర్క్‌.! కానీ ఇదంతా ఎలా..?

Lot of Money: వామ్మో.. ఇతని ఇంటినిండా నోట్ల కట్టలే.. ఇతనొక సాధారణ క్లర్క్‌.! కానీ ఇదంతా ఎలా..?

Anil kumar poka

|

Updated on: Aug 15, 2022 | 9:27 PM

అతనో సాధారణ క్లర్క్.. అతని జీతం నెలకు 50 వేలు ఉంటుంది. కానీ, ఆస్తులు మాత్రం కోట్లు. ఖరీదైన కార్లు, లగ్జరీ భవనాలు... వామ్మో అతని ఇంటినిండా కట్టల కట్టల డబ్బు..


అతనో సాధారణ క్లర్క్.. అతని జీతం నెలకు 50 వేలు ఉంటుంది. కానీ, ఆస్తులు మాత్రం కోట్లు. ఖరీదైన కార్లు, లగ్జరీ భవనాలు… వామ్మో అతని ఇంటినిండా కట్టల కట్టల డబ్బు.. చూస్తే నోరెళ్లబెడతారు. మధ్యప్రదేశ్‌లోని ఆర్థిక నేరాల విభాగం చేపట్టిన తనిఖీల్లో ఓ అవినీతి తిమింగలం వెలుగులోకి వచ్చింది. తనిఖీల సందర్భంగా పట్టుబడిన డబ్బుకు సంబంధిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. వివరాల్లోకి వెళ్తే…

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ సీనియర్ క్లర్క్‌గా పని చేస్తున్న హీరో కేశ్వాని నివాసంలో ఆర్థిక నేరాల విభాగం సోదాలు చేపట్టింది. ఈ తనిఖీల్లో EOW బృందం సుమారు కోటి రూపాయల నగదును రికవరీ చేసింది. దీంతో పాటు అతని భార్య పేరుమీదున్న మూడు లగ్జరీ ఫోర్ వీలర్ వాహనాలు, లక్షరూపాయల, ఆమె పేరుతో ఉన్న కోట్లాది రూపాయల ఆస్తి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. దాంతో అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న కోణంలో విచారణ జరుపుతున్నారు అధికారులు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఈఓడబ్ల్యూ అధికారులు కేశవాని ఇంటికి చేరుకోగానే.. షాక్‌ తిన్న అతను ఏంచేయాలో తోచక టాయిలెట్ క్లీనర్ తాగేశాడు. వెంటనే అలర్ట్ అయిన అధికారులు అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తున్నారు. 4000 జీతంతో ఉద్యోగం ప్రారంభించిన కేశవాని.. ప్రస్తుతం 50,000 అందుకుంటున్నాడు. కానీ, అతని ఆస్తులు మాత్రం కోట్లలో ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కేశవాని కుటుంబ సభ్యుల ఖాతాల్లోనూ డబ్బులు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కేశ్వాని ఇంటి గోడల్లోనూ నగదు పట్టుబడిందని అధికారులు తెలిపారు. స్టోర్ రూమ్‌లోనూ, ఇంట్లో ప్రతీ మూలనా ఒక రహస్య ప్లేస్‌ను గుర్తించారు అధికారులు. భారీగా డబ్బుతో పాటు, బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Published on: Aug 15, 2022 09:27 PM