Raj Kundra Case: రోజుకో మలుపు తిరుగుతున్న రాజ్‌కుంద్రా కేసు.. మళ్లీ షెర్లిన్ చోప్రాకు క్రైం బ్రాంచ్ నోటీసులు..

|

Aug 06, 2021 | 10:49 AM

Sherlyn Chopra – Raj Kundra Case : బాలీవుడ్‌లో పోర్నోగ్రఫీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ పోర్నోగ్రఫీ వ్యవహారంలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను

Raj Kundra Case: రోజుకో మలుపు తిరుగుతున్న రాజ్‌కుంద్రా కేసు.. మళ్లీ షెర్లిన్ చోప్రాకు క్రైం బ్రాంచ్ నోటీసులు..
Sherlyn Chopra And Raj Kundra
Follow us on

Sherlyn Chopra – Raj Kundra Case : బాలీవుడ్‌లో పోర్నోగ్రఫీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ పోర్నోగ్రఫీ వ్యవహారంలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను అరెస్టు చేసిన పోలీసులు ఇప్పటికే పలువురిని ప్రశ్నించారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరికి లింకులు ఉన్నాయనే వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులు కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. దీంతోపాటు ఈ కేసు విచారణను సైతం సైబర్ పోలీసులు వేగవంతం చేశారు. అయితే.. రాజ్‌కుంద్రాపై పలు ఆరోపణలు చేసిన బాలీవుడ్ నటి, మోడల్ షెర్లిన్ చోప్రాకు ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ ప్రాపర్టీ సెల్ నోటీసులు జారీ చేసింది. ఈరోజు విచారణకు హాజరు కావాలని ఆదేశించినట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు.

అయితే.. ఈ పోర్నోగ్రఫి వ్యవహారంలో ముందు నుంచి షెర్లిన్ చోప్రా పేరు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటికే షెర్లిన్ చోప్రాను పోలీసులు విచారించారు. మరలా విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. అంతకుముందు విచారణలో షెర్లిన్ చోప్రా సంచలన విషయాలను వెల్లడించినట్లు తెలిసింది. రాజ్‌కుంద్రా బలవంతంగా తనను ఈ వ్యవహరంలోకి లాగినట్లు ఆరోపించారు. అంతేకాకుండా తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ వెల్లడించింది. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత మొదట పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది తానేనంటూ షెర్లిన్ చోప్రా వెల్లడించింది.

విచారణలో.. రాజ్ కుంద్రా, నటి గహనా వశిష్ట్ బలవంతంగా తనతో పోర్న్ వీడియోలు చేయించినట్లు క్రైం బ్రాంచ్ పోలీసులకు వెల్లడించిందని సమచారం. అయితే.. మరలా క్రైంబ్రాంచ్ పోలీసులు షెర్లిన్ చోప్రాను విచారిస్తుండటంతో.. బాలీవుడ్‌లో ఈ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది. అయితే.. కీలక సమాచారం రాబట్టేందుకే షెర్లిన్ చోప్రాను పోలీసులు మరలా విచారించేందుకు సిద్ధమయ్యారని పేర్కొంటున్నారు.

Also Read:

Dail 112 : అత్యవసర డయల్ 100 నెంబర్ మారుతోంది.. ఇకపై దేశవ్యాప్తంగా ఒక్కటే నెంబర్.. “112”

RBI News: ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష.. వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం