Baby Murder Mystery: బాలుడి హత్య కేసులో మరో ట్విస్ట్.. వెలుగులోకి వచ్చిన నమ్మలేని నిజాలు.. మేనత్త శ్వేత అరెస్ట్‌!

|

Jun 19, 2021 | 6:22 PM

బాలుడి హత్య కేసులో మరో ట్విస్ట్.. వెలుగులోకి వచ్చిన నమ్మలేని నిజాలు.. మేనత్త శ్వేత అరెస్ట్‌! అనాజ్‌పూర్‌ వాటర్‌ ట్యాంక్‌లో శవమై కనిపించిన చిన్నారి డెత్‌ కేసులో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి.

Baby Murder Mystery: బాలుడి హత్య కేసులో మరో ట్విస్ట్.. వెలుగులోకి వచ్చిన నమ్మలేని నిజాలు.. మేనత్త శ్వేత అరెస్ట్‌!
Anajpur Baby Murder Mystery
Follow us on

Anajpur Baby Murder Mystery: అనాజ్‌పూర్‌ వాటర్‌ ట్యాంక్‌లో శవమై కనిపించిన చిన్నారి డెత్‌ కేసులో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. బాలుడ్ని చంపింది స్వయాన మేనత్త శ్వేతేనని పోలీసులు నిర్ధారించారు. ఆమెను అరెస్ట్ చేశారు. పిల్లలు పుట్టడం లేదని చనిపోయిన బాలుడి తల్లి అవమానించినందుకే హత్య చేసినట్లుగా పోలీసులు విచారణలో అంగీకరించింది.

మేనత్త అంటే అమ్మతో సమానం అంటారు. కానీ ఆమె బిడ్డలాంటి మేనల్లుడి ప్రాణం తీసింది. మరదలు చులనక చేసి మాట్లాడిందని… పిల్లలు పుట్టడం లేదన్న కోపంతో కుమిలిపోయింది. అభం శుభం తెలియని చిన్నారిపై విషం చిమ్మింది. ప్రాణం తీసింది. పిల్లలు లేరని అవమానిస్తున్న వదినకు అదే శాస్తి జరగాలని.. అమ్మమ్మ దగ్గర నిద్రపోతున్న రెండు నెలల బాలుడ్ని తీసుకెళ్లి మేడపైన ఉన్న వాటర్ ట్యాంకులో పడేసి ఏమి తెలియనట్లుగా చేతులు దులుపుకుంది. బాలుడ్ని చంపిన మేనత్త శ్వేతతోపాటు మేనమామ రాజుని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం అనాజ్‌పూర్ గ్రామానికి చెందిన శ్వేత ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. రెండేళ్లైనా శ్వేతకు ఇంత వరకు పిల్లలు పుట్టలేదు. పన్నెండేళ్ల తర్వాత అడపడుచుకు బిడ్డ పుట్టాడు. దీంతో అసూయ పెంచుకుంది శ్వేత. ఈ విషయంలో తరచూ ఫ్యామిలీలో గొడవలు జరిగేవి. ఇదే ఆ బాలుడి ప్రాణం తీసింది. పిల్లలు పుట్టడం లేదన్న అవమానాలు తట్టుకోలేకే హత్య చేసినట్లు విచారణలో అంగీకరించింది శ్వేత. తనకు పిల్లలు లేరని వదినకు కూడా అదే శాస్తి జరగాలన్న కసితో పిల్లాడిని చంపేసింది. అందరూ నిద్రపోతున్న టైంలో రెండేళ్ల బాలుడ్ని తీసుకెళ్లి మేడపైన ఉన్న వాటర్ ట్యాంకులో పడేసి ఏమి తెలియనట్లుగా వచ్చి పడుకుంది.

తెల్లవారుజామున లేచేసరికి పక్కన ఉండాల్సిన బిడ్డ కనిపించకుండా పోయే సరికి తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్లు వచ్చి ఇంటి పరిసరాలు మొత్తం తనిఖీ చేశారు. వాటర్‌ ట్యాంకును ఓపెన్‌ చేసి చూసి షాక్ తిన్నారు. అందులోనే చిన్నారి డెడ్‌బాడీని చూసి బోరుమన్నారు. తల్లి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా విచారణ చేసిన పోలీసులు నమ్మలేని నిజాల్ని రాబట్టారు. చిన్నారి డెత్ కేసు మర్డర్‌గా తేలడంతో పోలీసులు మేనమామ రాజుతోపాటు అతని భార్య శ్వేతను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి హత్యా కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Read Also…  Group Attack: గుంటూరులో ఆకతాయిల హల్ చల్.. పెట్రోల్ బంక్ వర్కర్‌పై దాడి.. ఆపై కాళ్ల బేరానికి..