AP Crime News: తప్పు.. తప్పు.. రూటు మార్చిన పూజారి.. భక్తులకు అడ్డంగా దొరికిపోయాడు

టెంపుల్స్‌లో దొంగతనాలు జరగడం ఇటీవల మనం చూస్తూనే ఉన్నాం. ఇక గుప్త నిధుల కోసం దేవాలయాల్లో తవ్వకాలు జరిపిన ఘటనలు...

AP Crime News: తప్పు.. తప్పు.. రూటు మార్చిన పూజారి.. భక్తులకు అడ్డంగా దొరికిపోయాడు
Preist Turns Thief

Updated on: Aug 06, 2021 | 4:09 PM

టెంపుల్స్‌లో దొంగతనాలు జరగడం ఇటీవల మనం చూస్తూనే ఉన్నాం. ఇక గుప్త నిధుల కోసం దేవాలయాల్లో తవ్వకాలు జరిపిన ఘటనలు కూడా చూశాం. ఇక దైవదర్శనానికి  క్యూ లైన్‌లో నిల్చున్న భక్తుల జేబులు కొల్లగొట్టే పిక్ పాకెటర్స్ గురించి కూడా మనం వినే ఉంటాం. కానీ ఆలయ పూజారే దొంగతనానికి యత్నించడం మీరు ఎప్పుడైనా చూశారా. తాజాగా అలాంటి ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. పత్తికొండ మండలం పులికొండ గ్రామంలో రంగస్వామి దేవాలయంలో భక్తుల ఆభరణాలను దొంగిలించేందుకు ఆలయ పూజారి యత్నించాడు. అప్రమత్తమైన భక్తులు, దొంగతనానికి ప్రయత్నించిన పూజారిని పట్టుకొని దేహశుద్ధి చేసి.. పోలీసులకు అప్పగించారు. పూజారి ఈ విధంగా చోరీ చేసేందుకు యత్నించడం తీవ్ర చర్చనీయాంశమైంది.

గుంటూరులోని ఓ హోటల్‌లో ఓ జంట ఆత్మహత్యాయత్నం

గుంటూరులోని ఓ హోటల్‌లో ఓ జంట ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. విజయ్‌ సాగర్‌ బాబు, రహేలు ఓ హోటల్‌లో గది తీసుకున్నారు. అనంతరం గొంతులు కోసుకున్నారు. చావు బతుకుల మధ్య కేకలు వేశారు. దీంతో హోటల్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. డోర్‌ ఓపెన్ చేసి వాళ్లిద్దరినీ కాపాడారు. వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నం చేసిన విజయ్‌ సాగర్ బాబు వయసు 28 ఏళ్లు కాగా.. ఆమె వయసు 45 ఏళ్లుగా గుర్తించారు. వాళ్లిద్దరూ ఎవరు.. ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న ‘జబర్దస్త్’ లేడీ.. ఎవరో తెలుసా..?

ఒంగోలు రిమ్స్‌లో దారుణం.. కాంట్రాక్ట్‌ నర్సుపై పేషెంట్‌ బంధువు లైంగిక దాడి