Andhra Pradesh: జైల్లో కుదిరిన ప్రెండ్షిప్.. బయటకు వచ్చాక ఎంతకు తెగించారంటే…

|

Jan 20, 2022 | 8:20 PM

జైల్లో ఉన్న సమయంలో తోటి ఖైదీలతో అతడికి స్నేహం కుదిరింది. అందరూ బయటకు వచ్చిన తరువాత ఒక ముఠా ఏర్పాడ్డారు. అనంతరం పక్కా ప్లాన్ తో ముందుకువెళ్లారు.

Andhra Pradesh: జైల్లో కుదిరిన ప్రెండ్షిప్.. బయటకు వచ్చాక ఎంతకు తెగించారంటే...
Jail
Follow us on

ప్రకాశం, గంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు దొంగల ముఠా సభ్యులను ఇంకొల్లు పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి దగ్గర నుంచి 5 లక్షల విలువైన బంగారు నగలు, ఆటో, సీసీ కెమెరా, మానిటర్‌, లక్షా 25వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో ప్రధాన నిందితుడిగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన వడ్డే మోషే గతంలో ఏలూరు, విశాఖ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి జైలుకు వెళ్ళి బెయిల్‌పై బయటకు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు.  జైల్లో ఉన్న సమయంలో తోటి ఖైదీలతో స్నేహం చేసి అందరూ బయటకు వచ్చిన తరువాత ఒక ముఠా ఏర్పాడ్డారు. అనంతరం గుంటూరులో ఓ ఆటోను చోరీ చేసి అందరూ కలిసి రాత్రిళ్ళు ఆటోలో తిరుగుతూ రెక్కీ నిర్వహిస్తున్నారు. ఏడాది కాలంగా ఒంగోలులో మకాం వేసి గ్రామ శివారులో ఉన్న దేవాలయాలు, తాళాలు వేసి ఇళ్ళను టార్గెట్‌గా చేసుకుని ప్రకాశంజిల్లాలో 13, గుంటూరుజిల్లాలో ఒక దొంగతనం చేశారు. దేవాలయాల్లోని హుండీల్లో చిల్లర సైతం వదలకుండా చోరీలకు పాల్పడ్డారు. ఇటీవల ఇంకొల్లులో జరిగిన ఓ చోరీ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు నిందితుల గురించి సమాచారం అందింది. వెంటనే వీరిని పట్టుకుని అరెస్ట్‌ చేశారు. వీరి దగ్గర నుంచి 5 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని ఎస్‌పి మలికగార్గ్‌ తెలిపారు. ఈ సందర్బంగా దొంగలను పట్టుకునేందుకు ప్రతిభ కనబర్చిన పోలీసు సిబ్బందికి ఎస్‌పి రివార్డులు అందించారు.

Also Read:  ఏపీలో ప్రమాదకరంగా కరోనా వ్యాప్తి.. భారీగా పెరిగిన యాక్టివ్ కేసులు.. ఆ 2 జిల్లాల్లో కల్లోలం

సాయి మాలలో ఇంట్లోకి వచ్చారు.. ఆశీస్సులు ఇస్తారనుకుంటే.. సీన్ రివర్స్