Fake Army Officer: ఆర్మీ అధికారిగా బిల్డప్.. ఒకరి తర్వాత ఒకరు.. అతని వలలో 53 మంది యువతులు..

|

Jul 07, 2021 | 2:44 PM

Posing as Army Officer: అతనేం ఆర్మీ అధికారి కాదు.. కానీ చుట్టూ బాడీగాడ్లు ఉంటారు.. వారంతా అధికారి అంటూ హడావుడి చేస్తుంటారు. ఆయన టార్గెట్ మొత్తం యువతులే..

Fake Army Officer: ఆర్మీ అధికారిగా బిల్డప్.. ఒకరి తర్వాత ఒకరు.. అతని వలలో 53 మంది యువతులు..
Fake Army Officer
Follow us on

Posing as Army Officer: అతనేం ఆర్మీ అధికారి కాదు.. కానీ చుట్టూ బాడీగాడ్లు ఉంటారు.. వారంతా అధికారి అంటూ హడావుడి చేస్తుంటారు. ఆయన టార్గెట్ మొత్తం యువతులే.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. నకిలీ ఖాతాలతో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ.. యువతులకు మెస్సేజ్ చేస్తాడు. అనంతరం డబ్బులు వసూలు చేస్తాడు. ప్రేమ, పెళ్లి అంటూ వారిని లోబరుచుకుంటాడు. ఇలా అతను మొత్తం 53 మంది యువతులను లోబరుచుకొని మోసం చేశాడు. నలుగురు యువతులను పెళ్లి చెసుకున్నాడు. ఒక యువతి, ఆమె తల్లి ఫిర్యాదుతో ఈ తతంగం అంతా బయటపడింది. ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది. ఈ మేరకు బిబ్వేవాడి పోలీసులు ఔరంగాబాద్‌కు చెందిన యోగేశ్ గైక్వాడ్‌ (26) ను అరెస్టు చేసి జైలుకు తరలించారు.

పోలీసుల కథనం ప్రకారం.. గతేఏడాది జనవరిలో తన తల్లి చికిత్స కోసం ఓ యువతి బిబ్వేవాడిలోని ఆసుపత్రికి వెళ్లింది. ఈ క్రమంలో ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పడంతో.. ఆమె యోగేశ్ గౌక్వాడ్‌కు ఆధార్, పలు పత్రాలను ఇచ్చింది. అనంతరం నిందితుడు.. ఆ యువతితోపాటు.. ఆమె తల్లితో పరిచయం పెంచుకున్నాడు. నకిలీ గుర్తింపు కార్డును చూపించి ఇద్దరిని లోబరుచుకున్నాడు. ఆ తర్వాత యువతిని వివాహం చేసుకొన్నాడు. ఆమె సోదరుడిని సైన్యంలో చేర్పిస్తానని చెప్పి రూ.2 లక్షలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. యువతి, ఆమె తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం అతని సెల్‌ను స్వాధీనం చేసుకొని విచారించగా.. మొత్తం 53 మంది యువతులను మోసం చేసినట్లు నిర్దారణ అయింది. దాదాపు అందరి దగ్గర లక్ష రూపాయలకు పైగా వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. 53 లక్షలకు పైగా నగదును యువతుల నుంచి దండుకున్నాడని.. పోలీసులు వెల్లడించారు. అయితే.. అతను మహిళలకు దగ్గర కావడానికి, ఎదుటివారిని ఆకట్టుకోవడానికి బాడీగార్డులను పక్కన తిప్పుకునే వాడని తెలిపాడు. వారు అలా తిరిగినందుకు రోజుకు రూ.2వేలు చెల్లించేవాడని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు ఔరంగాబాద్ లోని కన్నడ్ తాలూకాకు చెందినవాడని, అందరినీ సైన్యంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేశాడని పోలీసులు పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ ద్వారా మహిళలందరినీ టార్గెట్ చేశాడని పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి ఆర్మీ యూనిఫాం, 24 జతల బూట్లు, నాలుగు కార్లు, ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు బిబ్వేవాడి పోలీస్ స్టేషన్ అధికారి రాజేష్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Also Read:

Pollution Control Board: ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కార్యాలయానికి తెలంగాణ అధికారుల తాళాలు.. కారణం అదేనా..?

Viral News: టాయిలెట్ సీట్‌పై కూర్చున్న వ్యక్తి.. అంతలోనే ఊహించని షాక్.. మర్మాంగంపై కొరికిన పైథాన్.!