సామాన్యుల ఆశలు, ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు అదే పనిగా మోసాలకు పాల్పడుతున్నారు. వివిధ రకాల స్కీముల పేరుతో నిలువునా ముంచుతున్నారు. మరీ ముఖ్యంగా ఇటీవల ‘ఆన్‌లైన్ ట్రేడింగ్’ మోసాలు ఎక్కువ బయటపడుతున్నాయి. లోన్లు ఇప్పిస్తామని.. తక్కువ సమయంలోనే డబ్బులు రెట్టింపుచేస్తామంటూ అమాయకులకు టోకరా వేస్తున్నారు. వీటికి సంబంధించి పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తూన్నా మోసాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్‌లో ఇలాంటి మోసాలు రెండు జరిగాయి.
లక్షలు వస్తాయని చెప్పి..
బర్కత్‌పురలో నివాసముంటోన్న నిఖిల్ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన శ్రీరామ్ అనే వ్యక్తి ఇటీవల నిఖిల్‌కు పరిచయమయ్యాడు. ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే లక్షలు వస్తాయని శ్రీరామ్ నిఖిల్‌ను నమ్మించాడు. ఈ మాయమాటలు నమ్మిన నిఖిల్ శ్రీరామ్ అకౌంట్‌కు రూ.50 వేలు చేరవేశాడు. అంతే.. మరుసటి రోజు నుంచి శ్రీరామ్ ఫోన్ మూగబోయింది. నిజం తెలుసుకున్న నిఖిల్ పోలీసులను ఆశ్రయించాడు.
కేవైసీ అప్‌డేట్ అంటూ..
బల్కంపేటకు చెందిన మహేశ్ ఓ ప్రైవేట్ ఉద్యోగి. హాస్టల్‌లో ఉంటున్నాడు. మంగళవారం సాయంత్రం కేవైసీ అప్‌డేట్ పేరుతో మహేశ్ సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. ఇందులోని లింక్‌లను ఓపెన్ చేసిన అతడు తన వివరాలు నమోదు చేశాడు. దీంతో అతడి ఖాతాలో ఉన్న రూ.45 వేలు రెండు దఫాలుగా డెబిట్ అయ్యాయి. అసలు విషయం తెలుసుకున్న మహేశ్ ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో జరిగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు.
Also Read:
సభ్యసమాజం తలదించుకునే ఘటన.. 9వ తరగతి బాలికపై తండ్రీకొడుకులు అత్యాచారం
Police Raid: ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో పోలీసుల సడెన్ అటాక్.. 46 బైక్స్, 14 కోళ్లు సీజ్..
Hooch Tragedy: కాటేసిన కల్తీ మద్యం.. బీహార్‌లో 24 మంది మృత్యువాత.. మరికొంత మంది పరిస్థితి..