East Godavari District: ఎక్కడ చూసినా అదే సీన్.. ప్రతి రోజూ ఏదో ఒక చోట.. పోలీసులు స్మగర్లను అదుపులోకి తీసుకుంటూనే ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది మూడింటి గురించి.. ఒకటి.. ప్రపంచంలోనే అత్యంత విలువైన కలప ఎర్రచందనం(Red sandalwood).. శేషాచలం కొండల్లో మాత్రమే లభించే ఈ ఎర్ర బంగారాన్ని దేశాలు దాటించడానికి అక్రమార్కుల నిత్యం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక రెండోది వన్యప్రాణాలు. అవును… ఏనుగు దంతాలు, చర్మం.. జింక చర్మం, పులి గోర్లు.. నక్షత్ర తాబేళ్లు వంటి వాటిని మన దగ్గరి నుంచి స్మగ్లింగ్ చేసేందుకు దుండగులు ప్రయత్నిస్తున్నారు. ఇక మూడోది గంజాయి(Cannabis).. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. విశాఖ ఏజెన్సీ.. పరిసర ప్రాంతాల్లో గంజాయి సాగు రహస్యంగా సాగుతుందన్న రిపోర్ట్ ఉంది. ఆ గంజాయిని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు కేటుగాళ్లు డిఫరెంట్ రూట్లు ఫాలో అవుతున్నారు. వీటిలో ఏదో ఒక దాన్ని సరిహద్దులు దాటించేందుకు ప్రయత్నించి.. అక్రమార్కులు పోలీసులకు చిక్కుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో భారీగా గంజాయిని పోలీసులు సీజ్ చేశారు.
కిర్లంపూడి మండలం కృష్ణావరం టోల్‌ప్లాజా చెక్‌పోస్టు దగ్గర తనిఖీలు నిర్వహించారు. విశాఖ వైపు నుంచి ఒక కారు, లారీ అటువైపుగా వచ్చింది. పోలీసులు ఎందుకో ఆ వాహనాలపై తేడా కొట్టింది. అనుమానంతో ఆపి సోదాలు చేయగా.. లారీలో మొక్కజొన్న బస్తాల మధ్యన 66 మూటలలో 1,419 కేజీల గంజాయిని ఉండటాన్ని గుర్తించారు. గంజాయి సీజ్ చేసి, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు ఎస్కేప్ అయ్యారు. సీజ్ చేసిన బహిరంగ మార్కెట్‌లో రూ.1.30 కోట్లు ఉంటుందని పెద్దాపురం అడిషనల్ ఎస్పీ వెల్లడించారు.
Also Read: Tirupati: వేల పాములకు ప్రాణాలు నిలిపిన పుణ్యం.. స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు క్షేమం