అనుమతి లేకుండానే కోవిడ్ పరీక్షలు.. మంచిర్యాలలో పట్టుబడిన ప్రైవేటు ల్యాబ్‌ నిర్వాహకులు

|

May 24, 2021 | 10:55 PM

Police seize Covid kits: మంచిర్యాలలోని కొన్ని ప్రైవేటు ల్యాబ్‌ నిర్వాహకులు సర్జికల్‌ ఏజెన్సీల నుంచి అక్రమంగా కొవిడ్‌ కిట్లను సంపాదించి, ఒక్కొక్కరి వద్ద రూ.1500 నుంచి రూ.2 వేల వరకు తీసుకొని కరోనా పరీక్షలు చేస్తున్నారని వెల్లడించారు. మంచిర్యాల పట్టణంలో...

అనుమతి లేకుండానే కోవిడ్ పరీక్షలు.. మంచిర్యాలలో పట్టుబడిన ప్రైవేటు ల్యాబ్‌ నిర్వాహకులు
Police Seize Covid
Follow us on

కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంటే.. అందివచ్చిన అవకాశాన్ని కొందరు కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటున్నాయి. అనుమతులు లేకుండా పరీక్షలు చేయడం, చికిత్సలు అందించడం చట్టవిరుద్ధం అని చెప్పినా కొందరు అలాంటి తప్పుడు పనులే చేస్తున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో అనుమతి లేకుండా కరోనా పరీక్షలు చేస్తున్న  ముఠాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం సాయంత్రం ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీపీ అఖిల్‌ మహాజన్‌ మీడియాకు వెల్లడించారు.

మంచిర్యాలలోని కొన్ని ప్రైవేటు ల్యాబ్‌ నిర్వాహకులు సర్జికల్‌ ఏజెన్సీల నుంచి అక్రమంగా కొవిడ్‌ కిట్లను సంపాదించి, ఒక్కొక్కరి వద్ద రూ.1500 నుంచి రూ.2 వేల వరకు తీసుకొని కరోనా పరీక్షలు చేస్తున్నారని వెల్లడించారు. మంచిర్యాల పట్టణంలో ఆదివారం మెడికల్‌ ఏజెన్సీ, ప్రైవేటు ల్యాబ్‌లలో పోలీసులు తనిఖీలు నిర్వహించి ఆరుగురిని అదుపులోకి తీసుకొన్నారు. వారి నుంచి రూ.1.15 లక్షల విలువైన 460 కోవిడ్ టెస్టింగ్‌ కిట్లను స్వాధీనపర్చుకున్నారు. ఈ దందాకు సంబంధించి కె.శ్రీనివాస్‌, పి.సాగర్‌, ఎండీ అజీజ్‌, ఎండీ సలీమ్‌, జి.రాజేందర్‌, ఎ.ప్రశాంత్‌ లను అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి: 5,656 మద్యం బాటిళ్లు ధ్వంసం… మహిళా శక్తితోనే ఈ మహమ్మారికి చెక్ పెట్టాలంటున్న పోలీసులు

ప్రైవేటు ఆస్పత్రులను స్వాధీనం చేసుకుని.. ఉచిత వైద్యం అందించండి..! ప్రభుత్వానికి మావోయిస్టుల లేఖ..!