Crime News: అందరూ యూట్యూబ్‌ చూసి వంటలు నేర్చుకుంటుంటే.. ఈ కేటుగాళ్లు ఏం చేశారో తెలుసా.?

|

Dec 31, 2021 | 8:35 AM

Crime News: ప్రస్తుతం ఏ చిన్న సమాచారం కావాలన్నా యూట్యూబ్‌లో వెతికేస్తున్నారు. తమకు అంతకుముందు తెలిసిన పనులను కూడా మళ్లీ యూట్యూబ్‌లో చూసే చేసే రోజులు వచ్చేశాయ్‌...

Crime News: అందరూ యూట్యూబ్‌ చూసి వంటలు నేర్చుకుంటుంటే.. ఈ కేటుగాళ్లు ఏం చేశారో తెలుసా.?
Follow us on

Crime News: ప్రస్తుతం ఏ చిన్న సమాచారం కావాలన్నా యూట్యూబ్‌లో వెతికేస్తున్నారు. తమకు అంతకుముందు తెలిసిన పనులను కూడా మళ్లీ యూట్యూబ్‌లో చూసే చేసే రోజులు వచ్చేశాయ్‌. ఇంటి అలంకరణ నుంచి వంటల వరకు అన్నింటికీ యూట్యూబ్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతోంది. అయితే ఈ సాధానాన్ని ఉపయోగించుకొని మంచి చేస్తున్న వారు కొందరైతే.. నేరాలకు పాల్పడుతున్న వారు మరికొందరు. కొంతమంది కేటుగాళ్లు తమ నేరాలకు యూట్యూబ్‌ను ఒక ట్రైనింగ్ సెంటర్‌గా మార్చుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగిన ఓ సంఘటన ఇదే విషయాన్ని చెబుతోంది.

వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని ఔరంగబాద్‌ పుండలీక్‌ నగర్‌కు చెందిన ఇంజనీర్‌ సమ్రాన్‌ (30) అలియాస్‌ లక్కీ దొంగనోట్లను ముద్రించడం మొదలు పెట్టాడు. లక్కీతో పాటు మరో నలుగురు అతనికి సహాయం అందించారు. దొంగ నోట్లను ముద్రించే క్రమంలో సమ్రాన్‌ యూట్యూబ్‌ను వాడుకోవడం గమనార్హం. యూట్యూబ్‌లో వీడియోలను చూస్తూ దొంగ నోట్లను ఎలా ముద్రించాలో నేర్చుకున్నాడు. ఇందుకోసం ఓ గదిని అద్దెకు తీసుకొని మరీ ముద్రణ యంత్రం ఏర్పాటు చేసుకున్నాడు. దొంగనోట్లను ముద్రించి చిన్నచిన్న దుకాణాల్లో చలామణి చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఓ వైన్‌షాపు యమజానికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేటుగాళ్ల అసలు రూపం బయటపడింది.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఒక బృందంగా ఏర్పడి నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గతంలో దొంగనోట్ల చలామణి కేసులో అరెస్టయి బెయిల్‌పై బయటకు వచ్చిన రంగనాథ్‌ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. అతన్ని ఆరా తీయడంతో సమ్రాన్‌ విషయం కాస్త బయటకు వచ్చింది. సమ్రాన్‌తో పాటు అతనికి సహాయం చేస్తున్న మిగతా నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి కలర్‌ ప్రింటర్లు, రూ. 1,20,000 నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

Also Read: Allu Arjun’s Pushpa: జడేజా తర్వాత ఇప్పుడు వార్నర్ వంతు.. తగ్గేదే లే డైలాగ్ తో అదరగొట్టిన ఆసీస్ క్రికెటర్

Silver Price Today: తగ్గిన వెండి ధరలు.. ఈ రోజు కిలో వెండి ఎంతంటే..?

Dry List 2022: మద్యం షాపులకు కూడా సెలవులు ఉంటాయని మీకు తెలుసా..? ఏయే రోజుల్లో మూసి ఉంటాయి..!