Police Busted Red Sandalwood Dump: ఎర్రచందనం స్మగ్లర్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపితోంది. గత కొన్ని రోజులగా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేయడంతో వారి అగడాలు తగ్గుముఖం పట్టినా.. మళ్లీ ఎర్రచందనం అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా కడప జిల్లాలోని రైల్వే కోడూరు పరిధిలో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు, ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఎర్రచందనం స్మగ్లర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం సుమారు 725 కిలోల 27 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ముగ్గురు దొంగలను టాస్క్ ఫోర్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్‌పీ కేకేఎన్ అన్బురాజన్ తెలిపారు.
కాగా, రెండు రోజుల కిందట కడప జిల్లాలో ఎర్రచంనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఒంటిమిట్టకు చెందిన అంతర్రాష్ట్ర స్మగ్లరు కొత్త మాధవరం గ్రామానికి చెందిన టక్కోలి రవికుమార్ రెడ్డి, చొప్ప మురళి, నర్వకాటి పల్లికి చెందిన దులాదుల శ్రీనివాసులు ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలు ఏర్పర్చుకుని గత కొన్నేల్లుగా ఈ అక్రమ దందాకు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. టక్కోలి రవికుమార్ రెడ్డిపై ఇప్పటివరకు 9 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. గతంలో ఎర్రచందనం కేసుకు సంబంధించి పీడీ యాక్టులో సైతం జైలు శిక్ష అనుభవించాడు.
మరోవైపు, కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పరపల్లి గ్రామం సమీపంలోని హైవే వద్ద ఉన్న కలువ వద్ద గుండాల శంకర (37) అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్‌పీ తెలిపారు. ఇతనిపై జిల్లాలో 31 కేసులున్నాయని వెల్లడించారు. గతంలో శంకర్‌పై పీడీ యాక్టు కూడా ప్రయోగించడం జరిగిందని ఎస్.పి తెలిపారు. ఘటనా స్థలంలో తరలించేందుకు సిద్ధం చేసిన 20 దుంగలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.
జైలు నుంచి బయటకు వచ్చిన తమిళ కూలీలతో కలిసి ఒంటిమిట్ట అడవి ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను కొట్టించి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు అక్రమ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఓ వాహనంలో 20 ఎర్రచందనం దుంగలను తరలించేందుకు సిద్ధం చేసినట్లు ప్రత్యేక పోలీసు బృందాలకు సమాచారం అందడంతో దుద్యాల చెక్ పోస్టు వద్ద వాహనాన్ని తనిఖీ చేసి 27 ఎర్ర చందనం దుంగలను పట్టుకుని, వారిని అరెస్టు చేశారు.