Khammam District : పేకాట స్థావరం పై పోలీసులు దాడి.. 9 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్..

పేకాట స్థావరం పై పోలీసులు ఆకస్మిక దాడి చేసి పలువురిని అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లాలో ఓ మామిడి తోటలో పేకాట ఆడుతున్నారనే సమాచారం..

Khammam District : పేకాట స్థావరం పై పోలీసులు దాడి.. 9 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్..
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 07, 2021 | 9:28 PM

Khammam: పేకాట స్థావరం పై పోలీసులు ఆకస్మిక దాడి చేసి పలువురిని అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లాలో ఓ మామిడి తోటలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి పేకాట రాయుళ్లు అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటన జిల్లాలోని పెనుబల్లి మండలం ముత్తగూడెంలో చోటు చేసుకుంది.

పోలీసుల కథనం మేరకు..ముత్తగూడెం గ్రామా శివారు మామిడి తోటలో పేకాట ఆడుతున్నారే పక్కా సమాచారంతో  పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 13,500 రూపాయాల నగదు, 9 సెల్ ఫోన్లు, 6 బైకులను స్వాధీనం చేసుకోవడంతోపాటు పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని పెనుబల్లి పోలీసులు తెలిపారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

శశికళకు మరో షాక్ ఇచ్చిన తమిళ సర్కార్.. జయలలిత దత్తపుత్రుడు సుదాకరన్ ఆస్తుల జప్తు..