Anantapur district: గొప్ప ఘనకార్యమే చేశారు.. అడ్డంగా బుక్కయ్యారు.. గవ్వలతో

|

Nov 13, 2021 | 1:46 PM

అనంతపురం జిల్లాలో గుప్తనిధుల తవ్వకాలు కలకలంరేపాయి. డబ్బు ఆశతో గుప్తనిధుల వేటగాళ్ల మాటలు విని కర్ణాటక చెందిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కటకటాల పాలయ్యారు.

Anantapur district: గొప్ప ఘనకార్యమే చేశారు.. అడ్డంగా బుక్కయ్యారు.. గవ్వలతో
Treasure Hunt
Follow us on

అనంతపురం జిల్లాలో గుప్తనిధుల తవ్వకాలు కలకలంరేపాయి. డబ్బు ఆశతో గుప్తనిధుల వేటగాళ్ల మాటలు విని కర్ణాటక చెందిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కటకటాల పాలయ్యారు. రోళ్ళ మండలం హొట్టేబెట్ట గ్రామ సమీపంలోని కదిరెప్పకొండలో అతిపురాతనమైన కదిరెప్ప స్వామి ఆలయం ఉంది. ఈ దేవాలయంలో కొందరు వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతుండటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు. అలర్ట్ అయిన పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కదిరెప్ప స్వామి దేవాలయంలోని ఓ బండ కింద వజ్రాలు ఉన్నాయని క్షుద్రపూజలు చేసే స్వామి గవ్వల ఆధారంగా తెలిపారని గుప్తనిధుల వేటగాళ్లు పోలీసుల విచారణలో వెల్లడించారు.  ఆయన చెప్పిన ప్రకారమే తవ్వకాలు చేపట్టినట్లు వారు వివరించారు. అయితే, ఇందులో కర్ణాటక ప్రాంతానికి చెందిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఆరుగురు వ్యక్తులతో పాటు.. క్షుద్రపూజలు చేసే స్వామిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తవ్వకాల కోసం ఉపయోగించిన వస్తు సామాగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: అదిరిపోయిన అయ్యగారి అభిమాని డ్యాన్స్.. కింగ్ సాంగ్‌కు ఊరమాస్ స్టెప్పులు

ఏపీకి మరో తుఫాన్ ముప్పు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ