రెహానా ఫాతిమాకు మరో షాక్..!
కేరళ సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమాకు మరో షాక్ తగిలింది. అసభ్య రీతిలో శరీరంపై పెయింటింగ్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమెపై కేసు నమోదైంది. అయితే ఆమెను..

కేరళ సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమాకు మరో షాక్ తగిలింది. అసభ్య రీతిలో శరీరంపై పెయింటింగ్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమెపై కేసు నమోదైంది. అయితే ఆమెను అరెస్ట్ చేయడంలో అలసత్వం జరుగుతోందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇప్పటికే ఆమె పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. అయినప్పటికీ రెహానాను అరెస్ట్ చేయడంలో అధికారులు విఫలమయ్యారని తిరువల్లాకు చెందిన న్యాయవాది బుధవారం దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే ఆమెపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తన బెయిల్ పిటిషన్ కోర్టు రిజెక్ట్ చేయడంతో.. న్యాయ వ్యవస్థపై ఆమె తన అక్కసు వెల్లగక్కిందన్నారు. బెయిల్ కొట్టేసిన పది నిమషాలకే న్యాయవ్యవస్థను విమర్శిస్తూ.. ఓ వీడియోను అప్‌లోడ్ చేసిందని ఆరోపించారు.
Read More
భవనంలో భారీ పేలుడు.. 16 మందికి గాయాలు