Andhra Pradesh: త్రోబాల్ ప్రాక్టీస్ కోసమని పిలిచిన పీఈటీ.. ఇంత దారుణమా..?

| Edited By: Balaraju Goud

Feb 26, 2024 | 12:46 PM

విద్యార్థులకు క్రీడల మెలకువలు నేర్పాల్సిన పీఈటీ టీచర్.. ఓ బాలికపై కన్నేశాడు. మాయమాటలతో ట్రాప్ చేసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అభం శుభం తెలియని బాలిక అస్వస్తతకు గురవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. నిందితుడిపై పొక్సో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

Andhra Pradesh: త్రోబాల్ ప్రాక్టీస్ కోసమని పిలిచిన పీఈటీ.. ఇంత దారుణమా..?
Crime News
Follow us on

విద్యార్థులకు క్రీడల మెలకువలు నేర్పాల్సిన పీఈటీ టీచర్.. ఓ మైనర్ బాలికపై కన్నేశాడు. మాయమాటలతో ట్రాప్ చేసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అభం శుభం తెలియని బాలిక అస్వస్తతకు గురవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. నిందితుడిపై పొక్సో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన కేసు వివరాల ప్రకారం.. విశాఖపట్నం పోతిన మల్లయ్యపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రయివేటు స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది బాలిక. అదే స్కూల్లో పీఈటీ మాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు దుర్గా ప్రసాద్. ఆమెపై కన్నేసిన మాస్టర్ దుర్గా ప్రసాద్.. మొబైల్ నెంబరు సంపాదించి చాట్ చేస్తూ ఆమెను మెల్లగా మాయమాటల్లో దింపాడు. ఓ రోజు త్రో బాల్ ప్రాక్టీస్ ఉందని పిలిచి, ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. మాయమాటలతో బాలికను లోబర్చుకుని అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

కొన్ని రోజులు గడిచాయి. అయితే, ఓ రోజు స్కూల్ కు వెళ్లిన బాలిక అస్వస్థకు గురైంది. కడుపునొప్పితో రావడంతో పేరేంట్స్‌కు సమాచారమిచ్చారు స్కూల్ నిర్వాహకులు. బాలికను ఇంటికి తీసుకెళ్లిన తరువాత సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రలు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చినట్టు డాక్టర్ చెప్పడంతో షాక్ కు గురయ్యారు. తీవ్ర ఆవేదనతో ఇంటికి తీసుకెళ్లి బాలికను నిలదీసేసరికి అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పీఈటి మాస్టర్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డట్టు బాలిక తల్లిదండ్రులకు వివరించింది. దీంతో న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది బాదితురాలి తల్లి. ఈ విషయాన్ని ఫిర్యాదులో రాసి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు ఏసీపీ సునీల్. పొక్సో తోపాటు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. బాదితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మహిళా సంఘం ఆగ్రహం..

తొమ్మిదో తరగతి విద్యార్థినిపై పీఈటీ మాస్టర్ లైంగిక దాడి ఘటనపై మహిళా సంఘాలు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేసు సత్వర విచారణ జరిపి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు. ఘటనకు స్కూలు యాజమాన్యం కూడా బాధ్యత వహించాలని, జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ఈ కేసులో చొరవ చూపించి చర్యలు తీసుకోవాలని కోరారు మహిళా చేతన కార్యదర్శి పద్మ.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…