Hyderabad: పాతబస్తీలో దారుణం.. కడుపునొప్పితో వెళితే వార్డ్ బాయ్‌ చికిత్స.. చివరకు..

|

Dec 09, 2021 | 10:03 PM

Old City Private Hospital: కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన స్వర్ణకారుడు వైద్యం వికటించి మృతిచెందాడు. చార్మినార్​పోలీస్​స్టేషన్​పరిధిలో జరితగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. వార్డుబాయ్​ ఇచ్చిన ట్రీట్​మెంట్

Hyderabad: పాతబస్తీలో దారుణం.. కడుపునొప్పితో వెళితే వార్డ్ బాయ్‌ చికిత్స.. చివరకు..
Old City Private Hospital
Follow us on

Old City Private Hospital: కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన స్వర్ణకారుడు వైద్యం వికటించి మృతిచెందాడు. చార్మినార్​పోలీస్​స్టేషన్​పరిధిలో జరితగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. వార్డుబాయ్​ ఇచ్చిన ట్రీట్​మెంట్​ కారణంగానే వైద్యం వికటించి స్వర్ణకారుడు మృతి చెందాడని బాధితుడి బంధువులు పేర్కొంటున్నారు. ఈ ఘటన అనంతరం మృతుడి బంధువులు, న్యాయవాదులు, టీఆర్ఎస్​నాయకులు ఆసుపత్రి ఎదుట బైఠాయించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగాల్‌కు చెందిన అష్టరాయ్​18 సంవత్సరాల క్రితం హైదరాబాద్​పాతబస్తీ ఝాన్సీబజార్‌కు వలస వచ్చి నివసిస్తున్నాడు. ఝాన్సీబజార్‌లో ఓ జ్యువెల్లరీ దుకాణంలో స్వర్ణకారుణిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బుధవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో రాయ్​కు ఉన్నట్టుండి కడుపునొప్పి రావడంతో భార్య స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లింది. అక్కడ ఉన్న సిబ్బంది రాయ్‌కు ఇంజెక్షన్​ఇవ్వడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కాసేపటికే రాయ్​మృతిచెందాడని ఆసుపత్రి వర్గాలు తెలియజేశారు. దీంతో కుటుంబసభ్యులు కన్నీంటిపర్యంతమయ్యారు. అప్పటివరకూ బాగానే ఉన్న రాయ్.. ఎలా మరణించాడని వైద్య సిబ్బందిని ప్రశ్నించారు. వారినుంచి సరైన స్పందన లేకపోవడంతో.. కుటుంబభ్యులు స్థానిక టీఆర్ఎస్​నాయకుడు దీపాంకర్​పాల్​దృష్టికి తీసుకువచ్చారు.

వైద్యులు అందుబాటులో లేకపోవడంతో వార్డ్ బాయ్ అష్టరాయ్‌కు ఇంజక్షన్ ఇచ్చాడని.. దీని కారణంగా వైద్యం వికటించి మృతిచెందాడని ఆరోపిస్తూ మృతుని బంధువులు, న్యాయవాది ఎ.మాణిక్​ ప్రభుగౌడ్​, టిఆర్ఎస్​నాయకులు తదితరులు ఆసుపత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించారు. ఆ సమయంలో ఆసుపత్రిలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో వార్డు బాయ్‌తో చికిత్స చేయించారని, యాజమన్యం నిర్లక్ష్యం కారణంగానే నిండు ప్రాణం బలైందని, వెంటనే ఆసుపత్రిని సీజ్​ చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అలాగే మృతుని కుటుంబానికి రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆందోళనకు దిగిన వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు. మృతుని కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చార్మినార్​పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నూర్ మహ్మద్, టీవీ9 తెలుగు రిపోర్టర్, హైదరాబాద్

Also Read:

Road Accident: శుభకార్యానికి వెళ్లొస్తుండగా.. బైక్‌ను ఢీకొట్టిన లారీ.. చిన్నారి సహా దంపతుల మృతి..

Road Accident: శబరిమలకు వెళ్తుండగా ఘోర ప్రమాదం.. ఇద్దరు కర్నూలు వాసుల మృతి