Gold Smuggling: స్మగ్లింగ్ రాయుళ్లు రోజురోజుకీ తెలివి మీరుతున్నారు. అక్రమ రవాణా చేస్తూ జాతి సంపదకు గండికొడుతున్నారు. అధికారులు ఎన్ని రకాల చర్యలు చేపట్టినా అక్రమ దందా మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా బంగారం రవాణా నిత్యకృత్యంగా మారుతోంది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో బంగారం అక్రమ రవాణా యథేశ్చగా కొనసాగుతోంది. అడపాదడపా బంగారం అక్రమ రవాణా పట్టుబడుతూనే ఉంది.
ఈ క్రమంలోనే బంగారాన్ని ఎవరికీ దొరకకుండా స్మగ్లింగ్ రాయుళ్లు ఎవరికీ అంతు చిక్కని మార్గాలను అన్వేషిస్తున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో వెలుగులోకి వచ్చిన గోల్డ్ స్మగ్లింగ్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారాన్ని తీసుకొచ్చిన ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ప్రయాణికుడి నుంచి 350 గ్రాముల బంగారం సీజ్ చేశారు. బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ఆ ప్రయాణికుడు ఊహకు కూడా అందని ప్లాన్ వేశాడు.
ప్యాంట్ బెల్ట్ బకెల్ రూపంలో గోల్డ్‌ను తరలించేందుకు ప్రయత్నించాడు. బకెల్‌కు ముందు వైపు సిల్వర్ కలర్‌తో ఉండగా అధికారులు విప్పి వెనక్కి చూడగానే గోల్డ్ బకెల్ దర్శనమిచ్చింది. దీంతో సదరు ప్రయాణికుడిపై కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: EIL Recruitment: ఇంజనీరింగ్ చేసిన వారికి బంపరాఫర్.. ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు..
Medaram Maha Jatara 2022: ప్రధాన వేదిక మేడారమే అయినా చాలా చోట్ల జరిగే జాతర