Operation Langda: నేరస్థులే టార్గెట్‌గా ఆపరేషన్ లంగ్డా.. యోగి సర్కార్ యాక్షన్ ప్లాన్‌లో ఎన్ని ఎన్‌కౌంటర్లు జరిగాయో తెలిస్తే షాకే..

Uttar Pradesh Operation Langda: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారం చేపట్టిన నాటినుంచి లా అండ్ ఆర్డర్‌పై దృష్టిసారించింది. యోగి ఆధిత్యానాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం

Operation Langda: నేరస్థులే టార్గెట్‌గా ఆపరేషన్ లంగ్డా.. యోగి సర్కార్ యాక్షన్ ప్లాన్‌లో ఎన్ని ఎన్‌కౌంటర్లు జరిగాయో తెలిస్తే షాకే..
Uttar Pradesh Operation Langda

Updated on: Aug 13, 2021 | 12:02 PM

Uttar Pradesh Operation Langda: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారం చేపట్టిన నాటినుంచి లా అండ్ ఆర్డర్‌పై దృష్టిసారించింది. యోగి ఆధిత్యానాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఒకప్పుడు నిత్యం నేరాలు, హత్యలు, అత్యాచారాలతో అట్టుడుకిపోయే రాష్ట్రాన్ని కాపాడేందుకు వ్యూహాలను రచించి పోలీసులకు కీలక ఆదేశాలిచ్చారు. ఈ మేరకు నేరస్థులే టార్గేట్‌గా ఆపరేషన్ లంగ్డాను చేపట్టారు. యోగి నాలుగేళ్ల పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 8,472 ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్లల్లో 142 మంది హతమైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. 3,302 మంది నేరస్థులకు గాయాలయ్యాయి. చాలామందికి కాళ్లకే బుల్లెట్ గాయాలనైట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీంతోపాటు ఈ ఎన్‌కౌంటర్లల్లో 13 మంది పోలీసు సిబ్బంది మరణించగా.. 1557 మంది గాయపడ్డారు. నాలుగేళ్ల నుంచి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 18,225 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.

ఆపరేషన్ లంగ్డా అంటే.. కుంటివారిగా మార్చడం. అయితే.. ఇది అధికారికంగా ఉనికిలో లేకపోయినప్పటికీ.. అనధికారికంగా రాష్ట్రంలో దీనినే పిలుస్తున్నారు. అయితే.. పోలీసులు కూడా ఇదే విషయాన్ని పేర్కొంటుండటం గమనార్హం. అయితే.. నేరస్థులను హతమార్చితే పలువురి నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. నేరస్థులను అవిటివారిగా మార్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని సమాచారం. అయితే.. దీనిపై పోలీసులు మాత్రం స్పందించడం లేదు. దీనికోసం నిర్థిష్ట వ్యూహమంటూ ఏం లేదని పేర్కొంటున్నారు. అయితే.. బుల్లెట్ గాయాలైన తరువాత ఎంతమంది వికలాంగులుగా మారారన్న సమాచారాన్ని మాత్రం పోలీసులు వెల్లడించడం లేదు.

అయితే.. రాష్ట్రంలో జరగుతున్న ఎన్‌కౌంటర్లపై యూపీ పోలీస్ ఏడీజీ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ జాతీయ మీడియాతో మాట్లాడారు. పోలీసు ఎన్‌కౌంటర్లలో గాయపడినవారి సంఖ్య ఎక్కువగా ఉండటాన్ని చూస్తే.. నేరస్తులను చంపడం పోలీసుల ప్రాథమిక ఉద్దేశ్యం కాదని సూచిస్తోందన్నారు. వ్యక్తిని అరెస్టు చేయడమే ప్రాథమిక లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. కాగా.. ఇప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న ఎన్‌కౌంటర్లపై విపక్షాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. యోగి సర్కార్ చేపడతున్న ఆపరేషన్ లంగ్డాపై బహిరంగంగా విమర్శిస్తున్నారు.

Also Read:

Talibans: ఆప్ఘానిస్థాన్‌లో కొనసాగుతున్న హింస.. తాలిబన్ల గుప్పిట్లోకి కాందహార్‌‌ నగరం..

Honor killing: యువతిని దారుణంగా చంపిన కుటుంబసభ్యులు.. మరో వర్గానికి చెందిన యువకుడితో..