Bomb Blast: ఇంట్లో పేలిన బాంబు.. ఒకరు మృతి.. బాంబు పేలిన శబ్ధానికి స్థానికుల్లో భయాందోళన

తమిళనాడులోని మదురై జిల్లా ఉసిలంపట్టిలో బాంబు పేలుడు జరిగింది. ఓ ఇంట్లో అనుమతి లేకుండా బాంబులు తయారు చేస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ఇంటి...

Bomb Blast: ఇంట్లో పేలిన బాంబు.. ఒకరు మృతి.. బాంబు పేలిన శబ్ధానికి స్థానికుల్లో భయాందోళన
Bomb Blast

Updated on: Feb 16, 2022 | 9:46 PM

తమిళనాడులోని మదురై జిల్లా ఉసిలంపట్టిలో బాంబు పేలుడు జరిగింది. ఓ ఇంట్లో అనుమతి లేకుండా బాంబులు తయారు చేస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ఇంటి యజమాని దుర్మరణం చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఉసిలంపట్టి సమీపం నల్లివీరన్‌ పట్టిలో ప్రవీణ్‌ అనే వ్యక్తి తన ఇంట్లో చట్ట వ్యతిరేకంగా బాంబులు తయారు చేస్తున్నాడు. మంగళవారం ఉదయం ప్రవీణ్‌ ఇంట్లో బాంబులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా ఓ బాంబు భారీ శబ్దంతో పేలింది.

ఈ సంఘటనలో ప్రవీణ్‌ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇల్లు ధ్వంసమైంది. వీరి ఇంటితో పాటు పక్కనే ఉన్న మూడిళ్లు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళ, తొమ్మిది నెలల చిన్నారి గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. భారీ శబ్ధంతో బాంబు పేలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందోనని ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన తీరుపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవీ చదవండి.Bappi Lahiri: ఆ పాత మధురం రష్యా గాయకుడి నోట.. బప్పీలహరి పాట.. వీడియో వైరల్..

హిజాబ్ వివాదం పై స్పందించిన నటి.. మండిపడుతున్న నెటిజన్లు

కొబ్బరి చిప్పలతో ఆకట్టుకునే వస్తువుల తయారీ.. సింపుల్ ఐడియాస్ మీ కోసం