Gunfire at Hyderabad SBI ATM: హైదరాబాద్ నడిబొడ్డున గన్‌ఫైర్ తీవ్ర కలకలం సృష్టించింది. అది కూడా బడా బ్యాంక్ పక్కన ఎస్‌బీఐ ఎటీఎం సెంటర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. జనమంతా ఉండగానే తుపాకీ ట్రిగ్గర్ నొక్కాడు. ఆయన ఎవరో కాదు రక్షణగా ఉండాల్సిన సెక్యూరిటీ గార్డ్ సర్దార్ ఖాన్. ఒకటి కాదు.. రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు.
హైదరాబాద్‌లో కాల్పుల మోతతో ఉలిక్కిపడింది. గన్‌ఫౌండ్రీ SBI ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డు సర్దార్ ఖాన్.. తన సహోద్యోగిపై కాల్పులు జరిపాడు. ఈఘటనలో కాంట్రాక్ట్ ఉద్యోగి సురేందర్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో బ్యాంక్ సిబ్బంది, స్థానికుల సాయంతో హుటాహుటీన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బ్యాంక్ సిబ్బంది ఫిర్యాదు మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కాల్పులు జరిపిన సర్దార్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సహజంగానే గన్‌ఫౌండ్రీ బ్రాంచ్ రద్దీగా ఉంటుంది. గన్ పేలగానే.. జనం ఉలిక్కిపడ్డారు. బ్యాంక్ సిబ్బంది, కస్టమర్లు అంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు మళ్లీ ట్రిగ్గర్ నొక్కాడు. టపటపా మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు సెక్యూరిటీ గార్డ్ సర్దార్‌ఖాన్. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వాళ్లు సర్దార్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నాడు.
Read Also… KTR: ఈటలకు జరిగిన అన్యాయం ఏంటో.. మాజీ మంత్రి రాజేందర్‌పై తొలిసారిగా స్పందించిన మంత్రి కేటీఆర్