Hyderabad: వృద్ధురాలి తెలివితేటలు అదుర్స్.. బామ్మ దెబ్బకు దొంగ దొరికాడు

|

Oct 12, 2021 | 10:06 PM

తన ఇంట్లో దొంగతనం చేసిన దొంగను పట్టించడంలో ఓ వృద్ధురాలు ఎంతో తెలివిగా వ్యవహరించింది. ఆమె సమయస్ఫూర్తితో చేసిన పనికి పోలీసులు కూడా ఫిదా అయ్యారు.

Hyderabad: వృద్ధురాలి తెలివితేటలు అదుర్స్.. బామ్మ దెబ్బకు దొంగ దొరికాడు
Thief Caught
Follow us on

తన ఇంట్లో దొంగతనం చేసిన దొంగను పట్టించడంలో ఓ వృద్ధురాలు ఎంతో తెలివిగా వ్యవహరించింది. ఆమె సమయస్ఫూర్తితో చేసిన పనికి పోలీసులు కూడా ఫిదా అయ్యారు. ఇంతకీ ఆమె చేసిన పని ఏంటి..? దొంగను ఎలా పట్టించింది..? వివరాలు తెలుసుకుందాం పదండి.

గత నెల వినాయక చవితి సమయంలో సీటీలోని కేపీహెచ్‌బీ నాలుగోఫేజ్‌లో ఓ వృద్ధురాలు ఇంటికి తాళం వేసి నిజాంపేటలోని తన కుమార్తె ఇంటికి వెళ్లింది. మూడు రోజుల తర్వాత వచ్చేసరికి.. ఇంట్లో దొంగలు పడ్డట్లు అనుమానించింది. షాక్ తిన్న ఆవిడ.. కంగారు పడకుండా కాస్త సమయస్ఫూర్తితో పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఆ గదిలోని ఏ వస్తువులను కూడా ముట్టుకోలేదు. ఆవిడ చేసిన ఆ పనే క్లూస్ టీంకు బాగా ఉపయోగపడింది. ఘటనాస్థలంలో వేలిముద్రలు సేకరించిన పోలీసులు…పాత నేరస్థుల వేలిముద్రలతో పోల్చి చూసి దొంగను ఈజీగా పట్టుకున్నారు.

వృద్ధురాలి ఇంట్లో సేకరించిన వేలిముద్రలను పోలీసులు పాత నేరస్థుల వేలముద్రలతో పోల్చి చూశారు. అవి ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన పసుపులేటి దుర్గాప్రసాద్‌ (23)కు చెందినవిగా నిర్ధారించుకున్నారు. అనంతరం దుర్గా ప్రసాద్ ప్రజంట్ కృష్ణా జిల్లా కంచికచర్లలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే అక్కడికి వెళ్లిన పోలీసులు.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. 2018లో బంజారాహిల్స్‌ పరిధిలో బైక్ దొంగతనం కేసులో ఇతను అరెస్ట్‌ అయ్యాడు. పాత కేసుల్లో నిందితుడు కావడంతో ఇతనిపై పోలీసులు పీడీ చట్టం ప్రయోగించగా 2019 సెప్టెంబర్‌లో రిలీజయ్యాడు. అయినా బుద్ధి మార్చుకోని దుర్గాప్రసాద్‌.. కేపీహెచ్‌బీ, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, సూర్యాపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలు చేయసాగాడు. సెకండ్ క్లాస్ వరకే చదివిన ఇతను ఫోన్‌ వాడడు. సీసీ కెమేరాలున్నచోట అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తాడు. నిమిషాల వ్యవధిలో ఇళ్లు గుళ్ల చేస్తాడు. నిందితుడి నుంచి చోరీ చేసిన ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

Also Read:  ‘బెనర్జీ అన్న కళ్ళలో నీళ్లు చూసినపుడు రక్తం మరిగిపోయింది’… ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు

‘మోహన్ బాబు అమ్మను తిడితే తట్టుకోలేకపోయా’.. తనీష్ ఎమోషనల్ కామెంట్స్