Odisha: ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసిన యువతి.. పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ నిరసన..

శుక్రవారం వివాహ చేసుకోవాల్సి ఉండగా, రిజిస్ట్రార్ కార్యాలయానికి రాకపోవడంతో తనను మోసం చేశాడంటూ తిర్టోల్ శాసనసభ్యుడు దాస్‌పై జగత్‌సింగ్‌పూర్ సదర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Odisha: ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసిన యువతి.. పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ నిరసన..
Bjd Mla Bijay Shankar Das

Updated on: Jun 19, 2022 | 8:18 AM

జేడీ ఎమ్మెల్యే బిజయ్ శంకర్ దాస్ పెళ్లి పరుతో మోసం చేశాడని శనివారం ఆయనపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం వివాహ చేసుకోవాల్సి ఉండగా, రిజిస్ట్రార్ కార్యాలయానికి రాకపోవడంతో తనను మోసం చేశాడంటూ తిర్టోల్ శాసనసభ్యుడు దాస్‌పై జగత్‌సింగ్‌పూర్ సదర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. యువతి ఫిర్యాదు మేరకు IPC సెక్షన్లు 420, 195A, 294, 509, 341, 120B, 34 కేసుల్లో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్-ఇన్‌ఛార్జ్ ప్రవాస్ సాహు తెలిపారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ, మే 17న పెళ్లి చేసుకునేందుకు రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. 30 రోజుల తర్వాత శుక్రవారం వివాహం కోసం ఆ యువతి తన కుటుంబంతో సహా అక్కడికి చేరుకుంది. కానీ, సదరు ఎమ్మెల్యే హాజరుకాలేదని,  దీంతో పెళ్లి పేరుతో తనను మోసం చేశాడంటూ ఆ యువతి కేసు పెట్టిందని’ ఆయన తెలిపారు.

“దాస్‌తో తనకు మూడేళ్లుగా రిలేషన్‌షిప్ ఉందని, నిర్ణీత తేదీన పెళ్లి చేసుకుంటానని ఆయన హామీ ఇచ్చాడని, అయితే ఎమ్మెల్యే సోదరుడు, ఆయన ఇతర కుటుంబ సభ్యులు నన్ను బెదిరిస్తున్నారు. అతను తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు. నా ఫోన్ కాల్స్‌కు అతను స్పందించడం లేదు”అని ఆమె పేర్కొంది.