నెల్లూరు జిల్లాలో క్షుద్ర పూజల కలకలం

నెల్లూరు జిల్లాలో క్షుద్రపూజలు కలకలం సృష్టిస్తున్నాయి. కోవూరు మండలం పడుగుపాడు వద్ద క్షుద్రపూజలు నిర్వహిస్తున్నారిని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నెల్లూరు జిల్లాలో క్షుద్ర పూజల కలకలం

Updated on: Jun 15, 2020 | 10:26 AM

నెల్లూరు జిల్లాలో వరుస క్షుద్ర పూజలు కలకలం సృష్టిస్తున్నాయి. కోవూరు మండలం పడుగుపాడు వద్ద క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారిని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, గ్రామస్థులు సంఘటన స్థలానికి చేరుకోవటంతో… క్షుద్ర పూజలు నిర్వహిస్తున్న కొందరు వ్యక్తులు పారిపోయారు. వారి వెంట తీసుకొచ్చిన వస్తువులతోపాటు ఓ ద్విచక్ర వాహనాన్ని అక్కడే వదిలి పారిపోయారు.

పడుగుపాడు గ్రామ శివారులో ఇలాంటి క్షుద్ర పూజలు జరగటం ఇది నాలుగోసారి కావటంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. (జూన్ 11)సరిగ్గా నాలుగు రోజుల క్రితం శివాలయం వద్ద పసుపు, కుంకుమ, నిమ్మకాయలు పెట్టి ఇద్దరు వ్యక్తులు పూజలు చేస్తుంటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విచారణ జరుపుతున్నారు. అయితే వీరిని విచారిస్తున్న క్రమంలోనే మరోసారి ఇలా క్షుద్ర పూజలు జరగడంతో పడుగుపాడు గ్రామస్థులు భయందోళనకు గురవుతున్నారు.