దొరకని దొంగలు.. తలలు పట్టుకుంటున్న గుంటూరు పోలీసులు

| Edited By: Pardhasaradhi Peri

Jun 12, 2020 | 9:49 AM

గుంటూరు అమరావతి రోడ్డులోని సెంట్రల్ బ్యాంక్ పక్కనున్న ఏటీఎంలో నగదు నింపేందుకు వచ్చిన వాహనం నుంచి రూ.39 లక్షలు చోరీ జరిగింది. అది కూడా పట్టపగలు జరిగిన ఈ దొంగతనం కావటంతో మరింత సంచలనంగా మారింది. అయితే ఈ చోరీ జరిగి మూడు రోజులు కావస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి కనిపించడంలేదు. చోరీ జరిగిన తీరు… గుంటూరులోని పలు ఏటీఎంలలో రైటర్స్‌ సేఫ్‌గార్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఏటీఎంలో నగదు నింపుతుంది. మంగళవారం ఆ సంస్థకు చెందిన […]

దొరకని దొంగలు.. తలలు పట్టుకుంటున్న గుంటూరు పోలీసులు
Follow us on

గుంటూరు అమరావతి రోడ్డులోని సెంట్రల్ బ్యాంక్ పక్కనున్న ఏటీఎంలో నగదు నింపేందుకు వచ్చిన వాహనం నుంచి రూ.39 లక్షలు చోరీ జరిగింది. అది కూడా పట్టపగలు జరిగిన ఈ దొంగతనం కావటంతో మరింత సంచలనంగా మారింది. అయితే ఈ చోరీ జరిగి మూడు రోజులు కావస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి కనిపించడంలేదు.

చోరీ జరిగిన తీరు…

గుంటూరులోని పలు ఏటీఎంలలో రైటర్స్‌ సేఫ్‌గార్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఏటీఎంలో నగదు నింపుతుంది. మంగళవారం ఆ సంస్థకు చెందిన నాగేంద్ర, ప్రవీణ్‌లతో పాటు గన్‌మేన్‌ బ్రోజారావు, డ్రైవర్‌ తిరుపతిరావు వాహనంతో ఏటీఎం వద్దకు వచ్చారు. నగదును వాహనంలోనే ఉంచి ప్రవీణ్, నాగేంద్ర, బ్రోజారావు బ్యాంక్‌లోకి వెళ్లారు. అక్కడి నుంచి వచ్చేసరికి వాహనంలో రూ.39 లక్షలున్న నగదు బాక్స్ కనిపించలేదు.

పోలీసుల విచారణ…

దీంతో ఆ సంస్థ అధికారులు పోలీసులకు ఫిర్యాదు అందించంటంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే చోరీ జరిగి ఇప్పటికి మూడు రోజులు కావస్తున్నా… ఇంతవరకు కేసులో పురోగతి కనిపించడంలేదు. చోరీ జరిగిన వెంటనే నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. కానీ ఎలాంటి క్లూ లభించక పోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు…

చోరీకి పాల్పడిన వ్యక్తులు ఓ టూవీలర్‌పై పారిపోతున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అయితే ఆ ద్విచక్రవాహనంకు నెంబర్ ప్లేట్ లేక పోవడంతో పోలీసుల ప్రయత్నం అక్కడికే నిలిచిపోయింది.