Clickjacking: సరికొత్త సైబర్ మోసం’క్లిక్‌జాంకింగ్’.. మీకు వచ్చిన లింక్ పై క్లిక్ చేశారో షాక్ తప్పదు..

తాజాగా ఢిల్లీలో ఓ పెద్ద సైబర్ మోసానికి సంబంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ సంఘటన నవంబర్ నెలలో జరిగింది.

Clickjacking: సరికొత్త సైబర్ మోసం'క్లిక్‌జాంకింగ్'.. మీకు వచ్చిన లింక్ పై క్లిక్ చేశారో షాక్ తప్పదు..
Cyber Crime

Clickjacking: తాజాగా ఢిల్లీలో ఓ పెద్ద సైబర్ మోసానికి సంబంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ సంఘటన నవంబర్ నెలలో జరిగింది. దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, ముగ్గురు నేరస్తులను ఢిల్లీ నుండి అరెస్టు చేశారు. అయితే, వారి నాయకుడు ఆఫ్రికన్ జాతీయుడు. ఆఫ్రికన్ పౌరుల కోరిక మేరకు ఢిల్లీలో కూర్చున్న ఈ ముగ్గురు నేరగాళ్లు గెరియం వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది.

విచారణలో, ముగ్గురు నేరగాళ్లు తమ ఖాతాదారులను ట్రాప్ చేసేవారని, ఆ ఖాతాదారుల బ్యాంకు ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని ఆఫ్రికన్ పౌరులు రాబట్టేవారని పోలీసులకు తెలిసింది. ఈ చోరీకి సంబంధించిన సమాచారం మేరకు వివిధ ఖాతాల నుంచి విపరీతంగా డబ్బులు డ్రా చేశారు. ఆఫ్రికన్ పౌరులు అమాయక వ్యక్తుల మొబైల్‌లకు ఫిషింగ్ సందేశాలను పంపేవారు. తరువాత వారి నుంచి బ్యాంక్ ఖాతా నంబర్లు, ఐడిలు,పాస్‌వర్డ్‌లను దొంగిలించేవారు. ఈ ముఠాలు చాలా అరుదుగా సాధారణ ఖాతాల్లోకి ప్రవేశిస్తాయి. వారి దృష్టి కరెంట్,వ్యాపార బ్యాంకు ఖాతాలపై ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే, ఈ ఖాతాల్లో లక్షాలాది అలాగే కొన్ని ఎకౌంట్లలో కోట్లాది రూపాయలు కూడా ఉంటాయి.

సరైన లింక్‌లు అనుకుని అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం..

ఈ దోపిడి వ్యాపారంలో, ఈ ముఠా సైబర్ నేరాలకు కొత్త మార్గాన్ని కనుగొంది. ఈ కొత్త టెక్నాలజీకి ‘క్లిక్‌జాంకింగ్’ అని పేరు పెట్టారు. పేరు సూచించినట్లుగా, ఈ నేరం క్లిక్‌ల ద్వారా జరుగుతుంది. దుర్మార్గపు సైబర్ దాడి చేసే వ్యక్తులు ఈ సాంకేతికతను పూర్తిగా ఉపయోగించుకుంటారు. వాస్తవానికి, దాడి చేసేవారు సరైన లింక్ లా కనిపించే లింక్ పంపిస్తారు. దీనికి ఇచ్చే కాప్షన్ కూడా మిమ్ములను ఆ లింక్ క్లిక్ చేసేవిధంగా పురిగొల్పుతుంది. కానీ, ఈ లింక్ క్లిక్ చేస్తే అది మోసపూరితమైన తప్పుడు లింక్ కు కనెక్ట్ అయిపోతుంది.

దోపిడీ ఎలా ఉంది

ఇది రకరకాలుగా ఉంటుంది. మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఈ లింక్ క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ను మార్చుకోవచ్చు.. లేదా మీ మొబైల్ ఆపరేటర్ ను మార్చుకోవచ్చు. దీనికి ఏ విధమైన పోర్టబులిటీ అవసరం లేదు అంటూ మిమ్మల్ని ఆకర్షించే విధంగా ఆ మెసేజ్ ఉంటుంది. దానిని నమ్మి ఆ లింక్ క్లిక్ చేస్తే ఇక అంతే సంగతులు. తరువాత నెంబర్ లేదా పోర్టబులిటీ కోసం మీ సిమ్ వివరాలు.. మీ వ్యక్తిగత వివరాలు.. ఇలా అన్ని వివరాలు అడుగుతుంది ఆ లింక్. అన్నిటినీ మీరు ఇచ్చుకుంటూ పోయిన తరువాత మీ బ్యాంక్ ఎకౌంట్ నుంచి డబ్బులు ఖాళీ అయిపోతాయి.

డూప్లికేట్ సిమ్ నేరం

ఢిల్లీలో అరెస్టయిన నేరస్థులు కూడా అదే పని చేశారు. లక్ష్మీనగర్‌లోని ఓ దుకాణం నుంచి తన నంబర్‌కు సంబంధించిన సిమ్‌కార్డును ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు బయటకు తీశారని బాధితుడికి మొబైల్ కాల్ సెంటర్ ద్వారా తెలిసింది. పోలీసులు క్షుణ్ణంగా విచారణ జరిపి కాల్ సర్వీస్ ప్రొవైడర్లు, బ్యాంకు నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని సేకరించారు. ఈ నిందితులు నకిలీ ఓటర్ ఐడీల ఆధారంగా సిమ్ కార్డులు జారీ చేశారు. ఈ సిమ్‌ ద్వారా ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ చేసి బాధితుడి ఖాతా నుంచి రూ.10 లక్షలు డ్రా చేశారు.

జాగ్రత్త అవసరం..

ఎటువంటి పరిస్థితిలోనూ అపరిచితుల నుంచి వచ్చిన లింక్ లపై క్లిక్ చేయవద్దు. మీకు వచ్చిన మెసేజ్ గురించిన సమాచారం పూర్తిగా తెలుసుకున్నాకే దాని విషయంలో ఒ నిర్ణయం తీసుకోండి. అదేవిధంగా ఎటువంటి పరిస్థితిలోనూ మీ వ్యక్తిగత సమాచారం అపరిచిత లింక్ లో పంచుకోవద్దు. మోసపోకుండా ఉండాలంటే ఆన్లైన్ లో జాగ్రత్తగా ఉండాల్సిందే!

ఇవి కూడా చదవండి: EPF and LIC: మీ పీఎఫ్ ఎకౌంట్ నుంచి ఎల్ఐసీ ప్రీమియం చెల్లించే అవకాశం ఉంది తెలుసా? ఇదెలా సాధ్యమంటే..

Omicron: వామ్మో ఒమిక్రాన్.. ఇది ఎందుకు వేగంగా విస్తరిస్తుందో తెలిసింది..ఇది సాధారణ వేరియంట్ కాదు.. అంతకుమించి!

Vaccination Offer: టీకా వేయించుకోండి.. 50 వేల రూపాయల స్మార్ట్‌ఫోన్ గెలుచుకోండి..అదిరిపోయే ఆఫర్.. వివరాలివే!

Click on your DTH Provider to Add TV9 Telugu