Money in car Dickey : రోజువారీ తనిఖీల్లో భాగంగా వాహనాలను ఆపి చెక్ చేస్తోన్న నెల్లూరు పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. నెల్లూరు జిల్లా కోవూరు జాతీయ రహదారిపై సాయి బాబా గుడి సమీపంలో వెళ్తోన్న మారుతి స్విఫ్ట్ కారును ఆపారు పోలీసులు. పోలీసులు వివరాలు అడిగారు. అయితే, వారిచ్చిన సమాధానాలతో పోలీసులకు అనుమానం వచ్చి, కారులో తనిఖీలు చేపట్టారు. కారు డిక్కీని ఓపెన్ చేసిన పోలీసులకు భారీగా నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. కట్టల కొద్దీ డబ్బును కళ్ల చూసిన పోలీసులు, డబ్బుకు సంబంధించిన వివరాలు అడిగారు.
కారు లోని వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో, ఆధారాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్నట్లుగా సొమ్ముగా గుర్తించిన పోలీసులు ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఆపై ఓ పెద్ద సంచిలో ఆ డబ్బును కట్టలను పోలీస్ స్టేష్‌న్‌కు తీసుకెళ్లి లెక్కించారు. ఆ మొత్తం డబ్బు కోటి రూపాయలుగా గుర్తించారు. వీటిని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్‌కు అప్పగిస్తామని సీఐ రామకృష్ణ రెడ్డి తెలిపారు.
Read also : PK Sinha : పీఎం మోదీ ప్రధాన సలహాదారు పీకే సిన్హా రాజీనామా, వ్యక్తిగత కారణాలను చూపిస్తూ నిష్క్రమణ