Nellore Love Murder Case: నెల్లూరు లవ్‌ మర్డర్‌ కేసులో వీడిన గన్‌ మిస్టరీ.. మేడిన్ USA కాదు.. మరి ఎక్కడిదంటే..

నెల్లూరు లవ్‌ మర్డర్‌ కేసులో గన్‌ మిస్టరీ వీడిపోయింది. కావ్యారెడ్డి మర్డర్‌కు ఉపయోగించిన గన్‌.... మేడిన్ USA కాదు... మేడిన్‌ బీహార్‌గా తేల్చారు పోలీసులు.

Nellore Love Murder Case: నెల్లూరు లవ్‌ మర్డర్‌ కేసులో వీడిన గన్‌ మిస్టరీ.. మేడిన్ USA కాదు.. మరి ఎక్కడిదంటే..
Gun
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 20, 2022 | 7:06 AM

Nellore love murder case: నెల్లూరు నెత్తుటి ప్రేమ కథలో తుపాకీ మిస్టరీని ఛేదించారు పోలీసులు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కావ్యారెడ్డిని చంపడానికి ప్రేమోన్మాది సురేష్‌రెడ్డి ఉపయోగించిన గన్‌పై మేడిన్ USA అనే అక్షరాలు ఉండటం తీవ్ర సంచలనం రేపింది. అమెరికన్‌ మేడ్ గన్‌… ఓ మూరుమూల గ్రామానికి ఎలా వచ్చింది? అది కూడా ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ ఎలా సంపాదించాడు? అమెరికా నుంచి తెప్పించాడా? లేక నెల్లూరులోనే కొన్నాడా? అనే ప్రశ్నలు పోలీసుల ముందు చిక్కుముడిలా మారాయ్. కావ్యారెడ్డి మర్డర్‌ కేసు ఇన్వెస్టిగేషన్‌లో తుపాకీయే మెయిన్‌ ఇష్యూగా మారింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నెల్లూరు పోలీసులు, ఎన్‌ఐఏ సాయం తీసుకున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి కేసును ఇన్వెస్టిగేషన్‌ చేయించారు. చివరికి ప్రేమోన్మాది సురేష్‌రెడ్డి ఫోన్‌ కాల్స్‌ డేటా ఆధారంగా తుపాకీ మిస్టరీని ఛేదించారు. తుపాకీపై మేడిన్ USA అక్షరాలు ఉన్నప్పటికీ, అది తయారైంది మాత్రం బీహార్‌లోనే అని తేల్చారు పోలీసులు.

గన్‌పై మేడిన్ USA అనే అక్షరాలు ఉండటంతో సీరియస్‌గా తీసుకున్నామని, వివిధ కోణాల్లో ఇన్వెస్టిగేషన్‌ చేపట్టి, తుపాకీ మిస్టరీని ఛేదించామన్నారు పోలీస్ ఉన్నతాధికారులు. ఎన్‌ఐఏతోపాటు బీహార్‌ పోలీసుల సహకారం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి