Hyderabad: సెక్యూరిటీ ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహం తరలింపునకు యత్నం!

| Edited By: Balaraju Goud

Feb 15, 2024 | 4:44 PM

నిర్లక్ష్యం మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అంతేకాదు, అగమేఘాల మీద చనిపోయిన వ్యక్తి అనవాళ్ళు లేకుండా చేసేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ మహానగరం శివారు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.

Hyderabad: సెక్యూరిటీ ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహం తరలింపునకు యత్నం!
Car Garage
Follow us on

కుటుంబానికి భారం కావద్దనుకున్నాడు. వయసు మీద పడ్డ పొట్ట కూటి కోసం పని వెతుక్కుంటూ వచ్చాడు. ఎట్టకేలకు ఒక కారు గ్యారేజీలో సెక్యూరిటీ గార్డుగా చేరాడు. అంత బాగుంది అనుకున్న తరుణంలో విధి ఆడిన వింత నాటకంలో ప్రాణాలే పోయాయి. ఈ ఘటన హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంది. నిర్లక్ష్యం మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అంతేకాదు, అగమేఘాల మీద చనిపోయిన వ్యక్తి అనవాళ్ళు లేకుండా చేసేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ మహానగరం శివారు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.

చింతల్ అగ్రో సమీపంలో నిర్వహిస్తున్న కార్ గ్యారేజ్‌లో శివయ్య(65) సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అయితే ఫిబ్రవరి 14న విధుల్లో ఉన్న శివయ్యపైకి వెనుక నుంచి వచ్చిన కారు దూసుకెళ్ళింది. అక్కడే పని చేస్తున్న మెకానిక్ కారు రిపేరు చేసి, వేగంగా దూసుకు రావడంతో శివయ్య తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ హఠాత్తు పరిణామంతో షాక్ గురయ్యారు తోటి సిబ్బంది. వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.

అయితే తనకున్న పలుకుబడితో గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని తరలించేందుకు ప్రయత్నించారు గ్యారేజ్ యజమాని. పోలీసులకు సైతం సమాచారం ఇవ్వకకుండా కుటుంబసభ్యుల ద్వారా మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. జరిగిన ఘటనపై ఆరా తీస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..