వివేకా హత్య కేసు.. నిందితులిద్దరికి నార్కోటెస్టులు

| Edited By:

Aug 25, 2019 | 1:37 PM

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో విచారణ ఇంకా కొనసాగుతోంది. కేసుకు సంబంధించిన రంగయ్య, గంగిరెడ్డికి నార్కో అనాలసిస్ పరీక్షలు పూర్తయ్యాయి. మరో ఇద్దరు నిందితులు చంద్రశేఖర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డిని గుజరాత్ లోనే ఉంచి పోలీసులు విచారిస్తున్నారు. ఐదు నెలలుగా వివేకా హత్య కేసుకు సంబంధించి సిట్‌ బృందం దర్యాప్తు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా.. హత్య కేసులో అనుమానితులుగా ఉన్న వివేకా సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి, వాచ్‌మన్‌ రంగయ్య, కసనూరు పరమేశ్వర్‌రెడ్డి, దిద్దెకుంట శేఖర్‌రెడ్డిలను […]

వివేకా హత్య కేసు.. నిందితులిద్దరికి నార్కోటెస్టులు
Follow us on

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో విచారణ ఇంకా కొనసాగుతోంది. కేసుకు సంబంధించిన రంగయ్య, గంగిరెడ్డికి నార్కో అనాలసిస్ పరీక్షలు పూర్తయ్యాయి. మరో ఇద్దరు నిందితులు చంద్రశేఖర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డిని గుజరాత్ లోనే ఉంచి పోలీసులు విచారిస్తున్నారు. ఐదు నెలలుగా వివేకా హత్య కేసుకు సంబంధించి సిట్‌ బృందం దర్యాప్తు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా.. హత్య కేసులో అనుమానితులుగా ఉన్న వివేకా సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి, వాచ్‌మన్‌ రంగయ్య, కసనూరు పరమేశ్వర్‌రెడ్డి, దిద్దెకుంట శేఖర్‌రెడ్డిలను ఇరవై రోజుల క్రితం సిట్‌ బృందం నార్కో టెస్టులకు పులివెందుల కోర్టు అనుమతి తీసుకుంది. దీంతో వారిని గుజరాత్‌ గాంధీనగర్‌లో ఉన్న ల్యాబ్‌కు తీసుకెళ్లారు. శనివారం వాచ్‌మన్‌ రంగయ్యను, గంగిరెడ్డిని కడప పోలీసులు తిరిగి తీసుకొచ్చి పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. పరమేశ్వర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డిలకు కూడా నార్కో అనాసిస్‌ పరీక్షల అనంతరం.. పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.