MLC Anantha Babu: ఎమ్మెల్సీ అనంత బాబు ఎక్కడా.. సుబ్రమణ్యంను ఎవరు చంపారు..?

ఒక్క మర్డర్‌.. ఎన్నో అనుమానాలు.. మరెన్నో ట్విస్టులు. దీనంతటికి కారణమయ్యారు ఎమ్మెల్సీ అనంతబాబు(MLC Anantha babu). ఆయన ఎక్కడున్నారనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ..

MLC Anantha Babu: ఎమ్మెల్సీ అనంత బాబు ఎక్కడా.. సుబ్రమణ్యంను ఎవరు చంపారు..?
Ananthababu
Follow us

|

Updated on: May 22, 2022 | 8:33 PM

ఒక్క మర్డర్‌.. ఎన్నో అనుమానాలు.. మరెన్నో ట్విస్టులు. దీనంతటికి కారణమయ్యారు ఎమ్మెల్సీ అనంతబాబు(MLC Anantha babu). ఆయన ఎక్కడున్నారనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఈ ఇష్యూపై కాకినాడ(Kakinada) పోలీసులు ఇంకా నోరు విప్పడం లేదు. అటు డ్రైవర్ సుబ్రమణ్యం(Subramanyam) కుటుంబసభ్యులను మరోసారి విచారణకు రావాలంటూ పోలీసులు ఒత్తిడి తెస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే తాము విచారణకు రాము అంటూ తేల్చి చెప్పారు సుబ్రమణ్యం కుటుంబసభ్యులు. కేసు వాపసు తీసుకోవాలంటూ అనంతబాబు అనుచరులు, సుబ్రమణ్యం కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై కాకినాడలో రేపు దళిత సంఘాలు ఆందోళన చేయాలని నిర్ణయించుకున్నాయి. దీంతో కాకినాడలో హైటెన్షన్‌ నెలకొంది. దళిత సంఘాల ఆందోళన జరిగేలోపే అనంతబాబు అరెస్టును చూపించవచ్చనే ప్రచారం జరుగుతోంది.

అసలు ఏం జరిగింది..? మే 19న కాకినాడ జిల్లా 2 టౌన్ పరిధి వివేకానంద పార్క్ వీధిలో ఎమ్మెల్సీ అనంతబాబు కారులో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు సుబ్రహ్మణ్యం.. గతంలో ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద డ్రైవర్‌గా పని చేశాడు. అయితే రాత్రి 10.30 గంటల ప్రాంతంలో అనంతబాబు వచ్చి ఆయన కారులోనే తమ అబ్బాయిని ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి 1 గంటల సమయంలో మీ అబ్బాయి టిఫిన్‌ కోసం బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి చనిపోయాడని, డెడ్ బాడీని ఇంటికి తీసుకువచ్చినట్లు ఎమ్మెల్సీ చెప్పారని బాధిత కుటంబ సభ్యులు తెలిపారు. అయితే అనంతబాబు తిరిగి వెళ్తుండగా అడ్డుకోవడంతో కారు వదిలి పరారయ్యాడని మృతుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. యువకుడు కాళ్లు, చేతులు విరిచి మట్టిలో దొర్లించి కొట్టి చంపారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని, తమ కుమారుడిని చంపేసిన ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

సుబ్రహ్మణ్యంది పక్కగా హత్యగా తేలింది. సుబ్రమణ్యం మర్మాంగాలపై బలంగా కొట్టడంతోనే ఆయన మృతి చెందాడని పోస్ట్‌మార్టంలో వెల్లడైంది. అలాగే, సుబ్రహ్మణ్యం శరీరంపై గాయాలు ఉన్నట్లు నిర్ధారించారు. సుబ్రహ్మణ్యం ఎడమ చేయి, ఎడమకాలు బొటనవేలు, తలపై తీవ్ర గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎమ్మెల్సీ అనంత బాబును అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్దం చేశారు. అజ్ఞాతంలో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు కోసం.. ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాకినాడ, ఎల్లవరం, రాజానగరంలలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈరోజు అనంతబాబును అరెస్టు చూపించే అవకాశం కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తలకు ఇక్కడ క్లిక్‌ చేయండి..

Latest Articles