లాక్‌డౌన్ తర్వాత ఓటీటీ ప్లాట్ ఫామ్స్, ఆన్‌లైన్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ పెరిగాయి. ఈ క్రమంలోనే పోర్న్ కంటెంట్‌కు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో కేటుగాళ్లు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోర్న్ కంటెంట్‌ను వివిధ మార్గాల్లో అందిస్తున్నారు. తాజాగా ఈ తరహా చర్యలకు పాల్పడుతున్న ఓ ముఠాను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . వారి పని తీరు, ఆదాయాలు చూసి పోలీసులు కూడా షాక్‌కు గురయ్యారు.
ఈ ముఠా ఓటీటీ కంపెనీలు అందిస్తున్నట్లు చందా(ప్లాన్స్) ప్రాతిపదికన ప్రజలకు పోర్న్ అందిస్తోంది. వారానికి ఒక ఎపిసోడ్ లెక్క వీరు పోర్న్ కంటెంట్ రిలీజ్ చేస్తున్నారు. అదంతా ‘ఒరిజినల్’ కంటెంట్ అవ్వడం గమనార్హం. దీనికోసం ఓ ప్రత్యేక యాప్ కూడా రూపొందించారు. దాని ద్వారానే కంటెంట్ రిలీజ్ చేస్తున్నారు. ఈ కేసులో నటులతో సహా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా, పోలీసులు సోదాలు నిర్వహించి.. అనేక పేజీల పోర్న్ కంటెంట్ స్క్రిప్ట్స్, మొబైల్ కెమెరాలు, లైట్లు ఇతర షూటింగ్ మెటిరియల్ స్వాధీనం చేసుకున్నారు. స్క్రిప్ట్‌లో అశ్లీల సంభాషణలతో కూడిన మొత్తం సన్నివేశం డైలాగ్ వైజ్ రాసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ముఠా వారం రోజులకు సరిపడ కంటెంట్‌ను ఒక రోజులో షూటింగ్ చేస్తున్నారు. దీని కోసం చాలా టీమ్స్ కూడా పనిచేశాయి.
ఇలాంటి అనేక యాప్స్ బేస్డ్ ప్లాట్‌ఫాంలు నడుస్తున్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో కనుగొన్నారు. ఈ-మెంబర్‌షిప్ ఆధారంగా ఈ సంస్థలు పోర్న్ కంటెంట్‌ను అందిస్తున్నారు. అలాగే వారి చందాదారులు లక్షల్లో ఉండటం గమనార్హం. ఆదాయాలు కోట్లలో ఉండటం పోలీసులను షాక్‌కు గురిచేస్తోంది. పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ షూటింగ్ అంతా ఒక మహిళ మొబైల్ నుంచి రికార్డ్ అవుతుంది. పోలీసులు సోదాల కోసం వెళ్లినప్పుడు కూడా అక్కడ, షూటింగ్ జరుగుతోంది. పోలీసులు ఒక మహిళను ముఠా చెర నుంచి విడిపించారు. ఆమె వెబ్ సిరీస్‌లో పనిచేయడానికి అట్రాక్ట్ అయి వారి వద్దకు వెళ్లింది. ఆమె వీక్‌నెస్ క్యాష్ చేసుకుని అశ్లీష చిత్రాలవైపు మలిపింది సదరు ముఠా.
ఇలాంటి 12 యాప్‌లను కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఛానల్స్‌కు ఒక నెల సబ్‌స్కిప్షన్ రూ. 199 అని తెలుస్తోంది. అయితే అరెస్ట్ కాబడ్డ వ్యక్తులు మాత్రం తాము షూట్ చేస్తోంది బోల్డ్ లవ్ స్టోరీ ఫిల్మ్ అని చెబుతున్నారు. పెద్ద ప్లాట్‌ఫామ్‌లలో కూడా అశ్లీలత ఉందని చెప్పుకొస్తున్నారు.
Also Read: