సికింద్రాబాద్ పార్శిగుట్టలో దారుణం జరిగింది. భర్తతో ఉన్న విభేదాలతో భార్య.. ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యాయత్నం చేసుకుంది. భార్య చనిపోగా.. ఇద్దరు పిల్లలు సీరియస్‌గా ఉన్నారు. కార్పెంటర్ ప్రసాద్, అతని భార్య అంజలి తరుచూ గొడవ పడుతూ ఉండేవారు. ఇదే విషయంలో బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్‌లో ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు.
తాజాగా.. మళ్లీ ఇద్దరి మధ్య గొడవ జరగడంతో అంజలి తన ఇద్దరు కొడుకులు.. అమృత్, అనిరుధ్‌కు కూల్ డ్రింక్‌లో విషం కలిపి ఇచ్చి తాను తాగింది. వాంతులు, విరోచనాలు చేసుకోవడంతో స్థానికులు ముగ్గుర్నీ గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స తీసుకుంటుండగా అంజలి చనిపోయింది. ఇద్దరి పిల్లల పరిస్థితి విషమంగా ఉంది.