Chain Snatcher :గొలుసు దొంగతనాలలో ఆరితేరిన వ్యక్తి.. ఉమేష్ ఖతిక్(Umesh Kathik). ఇతడిది అహ్మదాబాద్(Ahmedabad). మంచినీళ్లు తాగినంత ఈజీగా చైన్ స్నాచింగ్ చేసేస్తాడు. వివిధ రాష్ట్రాల్లో 100కు పైగా గొలుసు చోరీలు చేసి రికార్డు క్రియేట్ చేశాడు. మైనర్‌గా ఉన్నప్పుడే ఈ దారిని ఎంచుకున్నాడు. జైలుకెళ్లినా బుద్ది మారలేదు. బయటకు వచ్చాక వరుస చోరీలతో పోలీసులకు సవాల్ విసిరాడు. పోలీసు రికార్డుల ప్రకారం ఇతడి పేరు ఉమేష్ అలియాస్ లాలో గులాబ్జీ ఖతిక్. తాజాగా ఈ నెల 19న హైదరాబాద్(Hyderabad), సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వరుసగా 5 గొలుసు దొంగతనాలు చేసి పారిపోయాడు. హైదరాబాద్ పోలీసులు పక్కా ఆధారాలతో సమాచారం ఇవ్వడంతో అహ్మదాబాద్ పోలీసులకు పట్టుబడ్డాడు. అక్కడే గతంలో ఓ కేసు ఉండటంతో జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. అయితే అతడు విచారణలో ఇంట్రస్టింగ్ విషయాలు వెల్లడించాడు. భార్యపై ప్రేమతోనే గొలుసు చోరీలు చేస్తున్నట్లు వెల్లడించాడు. చోరీలు చేసే సమయంలో ఎటువంటి ట్రాకింగ్ ఉండకుండా ఉండేందుకు సెల్‌ఫోన్లలోని సిమ్‌కార్డులు తీసివేస్తానని తెలిపాడు.
రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కూడా ఉమేష్ ఖతిక్‌పై కేసులున్నాయి. ఆయా రాష్ట్రాల పోలీసులు కూడా అదుపులోకి తీసుకుని ఇంట్రాగేట్ చేసేందుకు సిద్దమవుతున్నారు. కాగా ట్రాన్సిట్ వారెంట్ అతడిని హైదరాబాద్ తీసుకొచ్చే వీలుంది. కానీ ప్రస్తుతం కరోనా తీవ్రత నేపథ్యంలో అతన్ని తీసుకురావాలా వద్దా అనే విషయంపై మన పోలీసులు సతమమతున్నారు. గతంలో ఉమేష్ ఇక్కడ ఏమైనా నేరాలు చేశాడా అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు.
Also Read: ‘పాల’కూట విషం.. పా’పాల’ బైరవులు.. బ్రాండెడ్ మిల్క్ అని తెస్తే.. బ్రతుకంతా విషమే