విజయనగరం జిల్లా భోగాపురం మోడల్ స్కూల్ విద్యార్థి మృతి సంచలనంగా మారింది. స్కూల్ ప్రిన్సిపాల్ కఠిన వైఖరి కారణంగానే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈక్రమంలో ప్రిన్సిపాల్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్న డిమాండ్‌తో నేడు మోడల్ స్కూల్ వద్ద నేడు ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. విజయనగరం భోగాపురం మోడల్ స్కూల్‌లో 9వతరగతి చదువుతున్నాడు యోగిందర్ రెడ్డి. అయితే అతని ప్రవర్తన సరిగా లేదని తండ్రికి ఫిర్యాదు చేసి.. టీసీ ఇచ్చారు ప్రిన్సిపల్ సంధ్యారాణి. దీంతో తండ్రి అతడిని ఇంటికి తీసుకెళ్తుండగా పరారయ్యాడు. ఆ తర్వాత స్కూల్‌కు సమీపంలోనే మామిడి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా యోగిందర్‌రెడ్డి మృతికి ప్రిన్సిపల్ సంధ్యారాణి వైఖరే కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాము హాస్టల్‌కు వెళ్లేసరికి చేతిగాయంతో ఉన్న తన కుమారుడిని మోకాళ్లపై కూర్చోపెట్టారని.. ఇదేమిటని అడిగిన తనను తీవ్రంగా దూషించారని విద్యార్థి తల్లిదండ్రులు వాపోతున్నారు.
కాగా పాఠశాల తరగతి యోగితో పాటు కొంతమంది విద్యార్థులు గదిలో సెల్ఫీలు తీసుకొని స్టేటస్ గా పెట్టుకున్నారని, ఈ విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ యోగితో పాటు కొంతమంది విద్యార్థులను పిలిపించి తీవ్రంగా మందలించిందని తెలుస్తోంది. అంతేకాక వారి తల్లిదండ్రులు కూడా పాఠశాలకు పిలిపించి విద్యార్థులకు టీసీలు ఇచ్చి పంపిస్తామని హెచ్చరించింది. అయితే మొదటి తప్పుగా భావించి వదిలేయాలని విద్యార్థి తండ్రి ప్రిన్సిపాల్ ను కోరారు. అయినప్పటికీ ఆమె వినకుండా మీ అబ్బాయిని తీసుకుని వెళ్లిపోవాలని చెప్పింది. దీంతో కుమారుడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన తండ్రి అతడిని గట్టిగా మందలించాడు. ఈక్రమంలోనే ఇంటి తీసుకెళ్తుండగానే తప్పించుకొని పారిపోయాడు. ఆ మరుసటి ఉదయమే స్కూల్‌లోని చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. కాగా పాఠశాల ప్రిన్సిపాల్ కఠిన వైఖరి కారణంగానే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు, విద్యార్థి నాయకులు ఆరోపిస్తున్నారు.
Also Read:PM Narendra Modi: ప్రధాని మోదీకి అద్భుత శక్తులున్నాయ్.. కాంగ్రెస్ సీనియర్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు..
Virat Kohli: అనుకున్నదంతా అయ్యింది.. కేవలం 7 పరుగుల దూరం.. కోహ్లీ ఫ్యాన్స్ గుండె బద్దలు.!