Meghalaya Accident: మేఘాలయలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు నీటిలో గల్లంతు కాగా.. మరికొంతమందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మేఘాలయలోని నోంగ్‌చ్రామ్ సమీపంలో జరిగింది. బుధవారం అర్థరాత్రి తురా నుంచి షిల్లాంగ్ నగరానికి వెళుతున్న బస్సు.. ప్రమాదవశాత్తు నోంగ్‌చ్రామ్‌లోని రింగ్ది నదిలో పడిపోయింది. వంతనపైనుంచి నీటిలో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు నలుగరు ప్రయాణికులు మరణించారని పోలీసులు వెల్లడించారు. మరో ఇద్దరు గల్లంతైనట్లు పేర్కొంటున్నారు. కాగా.. ప్రమాదం జరిగిన బస్సులో 22 మంది ప్రయాణికులున్నారని ఈస్ట్ గారో హిల్స్ పోలీసులు తెలిపారు.
Meghalaya | Four passengers died after a bus travelling from Tura to Shillong fell into Ringdi river at Nongchram at 12 am. Injured have been hospitalised. Rescue operation for other passengers is underway: East Garo Hills Police pic.twitter.com/JvmD1dl6w6
— ANI (@ANI) September 30, 2021
Also Read: