Cyber Crime: మెడికల్ విద్యార్థిని.. పక్కింటి పిల్లాడే కదా అని ఫోన్ ఇచ్చింది.. కానీ ఆ తర్వాత తెలిసింది..

|

Oct 04, 2021 | 1:33 PM

ప్రస్తుత సమాజంలో పరిస్థితి దారుణంగా మారింది. ఎవరు ఎటువంటి వారో తెలియకుండా పోతోంది. పైకి అమాయకంగా నటించి.. లోపల మాత్రం మోసగాళ్లుగా ఉంటున్నారు..

Cyber Crime: మెడికల్ విద్యార్థిని.. పక్కింటి పిల్లాడే కదా అని ఫోన్ ఇచ్చింది.. కానీ ఆ తర్వాత తెలిసింది..
Cyber Crime
Follow us on

ప్రస్తుత సమాజంలో పరిస్థితి దారుణంగా మారింది. ఎవరు ఎటువంటి వారో తెలియకుండా పోతోంది. పైకి అమాయకంగా నటించి.. లోపల మాత్రం మోసగాళ్లుగా ఉంటున్నారు. పిల్లలు కూడా ఇంటర్నెట్, సోషల్ మీడియా మత్తులో పడి దుర్మర్గంగా ఆలోచిస్తున్నారు. ఓ మెడికల్ విద్యార్థిని, ఆమె ఇంటి పక్కన 9వ తరగతి చదివే ఓ పిల్లాడు ఉన్నాడు. అక్కా అని పిలుస్తూ.. తరచూ ఇంటికి వచ్చేవాడు. అక్కా ఫోన్ ఇవ్వవా గేమ్ ఆడుకుంటాను అంటే మొబైల్ ఇచ్చింది. అడిగిన ప్రతిసారీ ఫోన్ ఇచ్చేది. కానీ మైనర్ చివరికి ఏం చేశాడంటే..

ఆమె ఫోన్‎లో పాస్ వర్డ్ మార్చి.. అక్కడ నుంచి ఆమె పేరుతో ఆన్‌లైన్‌ క్లాసుల్లో అసభ్య సందేశాలు పెట్టడం.. ఆమె ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో అశ్లీలచిత్రాలు పోస్ట్‌చేయడం వంటివి చేశాడు. ఈ విషయం తెలియని ఆ యువతి.. తన ఈమెయిల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు హ్యాక్‌ అయ్యాయంటూ వాపోయింది. స్నేహితరాలి సలహాతో యువతి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు.. సాంకేతిక ఆధారాలతో ఆ బాలుడి గుట్టు రట్టు చేశారు. అతణ్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం అంగీకరించాడు. ఇతరుల ఫోన్‌లు తీసుకొని వారి మెయిల్స్‌ ఓపెన్‌ చేయడం, పాస్‌వర్డులు మార్చడం, తర్వాత వేరే సిస్టంలో మెయిల్‌ ఓపెన్‌ చేసి అసభ్యకర మెసేజ్‌లు పంపడం నెట్‎లో చూసి నెర్చుకున్నానని చెప్పాడు.

బాలుణ్ని పోలీసులు జువెనైల్‌ హోమ్‌కు తరలించారు. అయితే.. తనతో స్నేహంగా ఉన్న పక్కింటి బాలుడే ఇలాంటి నీచమైన పనికి పాల్పడ్డాడని తెలియడంతో ఆ యువతి షాకైంది. ఎవర్ని పడితే వాళ్లను గుడ్డిగా నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే పిల్లలు ఏం చేస్తున్నారని తల్లిదండ్రులు గమనించాలని కోరారు.

Read Also.. Plane Crash: గాలిలోనే కలిసిపోయిన ప్రాణాలు.. బిల్డింగ్‌పై కూలిన విమానం.. ఎనిమిది మంది దుర్మరణం..