Vehicle Insurance : మీకు వెహికల్ ఇన్సూరెన్స్ ఉందా..? అయితే ఈ విషయాలు తెలుసుకోండి.. లేదంటే మోసపోతారు..

|

Mar 11, 2021 | 9:44 PM

Vehicle Insurance Fraud:వెహికల్ ఇన్సూరెన్స్ పేరు మీద జోరుగా నకిలీ దందా నడుస్తోంది. రవాణా శాఖ పేరుపై కొంతమంది ముఠాగా ఏర్పడి నకిలీ బీమాలు చేస్తున్నారు. చేతివాటంతో

Vehicle Insurance : మీకు వెహికల్ ఇన్సూరెన్స్ ఉందా..? అయితే ఈ విషయాలు తెలుసుకోండి.. లేదంటే మోసపోతారు..
Follow us on

Vehicle Insurance Fraud:వెహికల్ ఇన్సూరెన్స్ పేరు మీద జోరుగా నకిలీ దందా నడుస్తోంది. రవాణా శాఖ పేరుపై కొంతమంది ముఠాగా ఏర్పడి నకిలీ బీమాలు చేస్తున్నారు. చేతివాటంతో వాహనదారులను తికమక పెడుతున్నారు. బీమా ప్రీమియం ధర కంటే 50 శాతం తక్కువ రేటుకే ఇస్తున్నట్లు చెప్పి వాహనదారులను మోసం చేస్తున్నారు. దీంతో వాహనదారుడు ప్రమాదానికి గురైనప్పుడు క్లెయిమ్ చేసుకోవాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. మోసం ఎలా చేస్తున్నారో ఇప్పడు తెలుసుకుందాం.

బీమా కంపెనీలు తాము జారీచేసిన బాండ్లలో బార్ కోడ్లను ఏర్పాటు చేస్తాయి. దీనిని గుర్తించిన అక్రమార్కులు బార్ కోడ్లు, సీరియల్ నెంబర్లను మార్చేసి అమ్మేస్తున్నారు. పోలీసులు, రవాణా శాఖ అధికారులు వాహనాల తనిఖీ సమయంలో బార్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా వారి వాహన వివరాలు, ప్రీమియం చివరి తేదీకి సంబంధించిన వివరాలు చూస్తుంటారు. కానీ కంపెనీ వెబ్‌సైట్‌లో ప్రీమియం నెంబర్‌ను సెర్చ్ చేస్తే అసలు విషయం తెలుస్తుంది. అది అసలైనదా.. నకిలీదా అని.

ఇలాంటి నేరాలు చేస్తున్న ముఠాను కొన్ని రోజుల క్రితమే సైబర్ పోలీసులు పట్టుకున్నారు. రిజిస్ట్రేషన్, పొల్యూషన్ చెక్ కోసం వచ్చే వారిని క్యాచ్ చేసుకొని రూ.పది వేల బీమాను రూ.రెండు వేలకే అందిస్తామని చెప్పి కొన్ని వందల మందికి బైక్, ఆటో, కార్, ట్రక్ వాహనదారులకు బీమాలు అమ్మినట్లు నిందితులు వెల్లడించారు.

మరిన్ని చదవండి :

స్కూల్‌ లైఫ్‌లో తమన్నా మా సీనియర్.. అయితే ఆమె అందం గురించి బుట్టబొమ్మ ఏం కామెంట్ చేసిందంటే..?

రెండు లక్షలు, బైక్ ఇస్తేనే పెళ్లి.. లేదంటే కుదరదు.. కట్‌చేస్తే ఆస్పత్రిలో బెడ్‌పై యువతి..

Deepika Padukone : ఫిట్‌నెస్ అంటే కనిపించే శరీరం కాదు.. దానికి వేరే అర్థం చెబుతున్న బాలీవుడ్ బ్యూటీ..