
హైదరాబాద్ ఎల్బీనగర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పాత కార్ల షోరూమ్‌లో మంటలు చెలరేగాయి. కార్ ఒ మెన్ కార్ అనే గ్యారేజ్‌లో మంటలు ఎగిసిపడుతుండటంతో భయాందోళన నెలకొంది. ఈ ప్రమాదంలో 50కిపైగా కార్లు పూర్తిగా తగలబడ్డాయి. భారీ శబ్దాలతో కార్ల గ్యారేజ్ తగులబడుతోంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ప్రమాదం కారణంగా పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలుముకున్నాయి. అధికారులు చుట్టుపక్కల వారిని ఖాళీచేయిస్తున్నారు. ఘటన స్థలంలో నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. అయితే ఈ ప్రమాదం కారణంగా ఎంత నష్టం వాటిల్లిందనే విషయం ఇంకా తెలియరాలేదు.