Rajasthan Fire Accident: రాజస్థాన్ రాజధాని జైపూర్ (Jaipur) కు సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జామ్వా రాంగఢ్‌లోని టర్పెంట్ ఆయిల్ ఫ్యాక్టరీ (oil factory) లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా నలుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుచ్చారు. ఈ ఘటనపై డిప్యూటీ ఎస్పీ శివకుమార్ భరద్వాజ్ మాట్లాడుతూ.. ఈ ఘటన (Fire Accident)లో నలుగురు మృతి చెందారని తెలిపారు. వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు పేర్కొన్నారు. మరో ముగ్గురు కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని తెలిపారు.
ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జైపూర్ పోలీసులు తెలిపారు. కాగా.. ఫ్యాక్టరీలో పేయింట్ పనుల కోసం టర్పెంట్ ఆయిల్‌ను ప్యాక్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు పేర్కొంటున్నారు. కాగా.. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.
Also Read: