Crime News: నల్లగా ఉన్నావ్.. వదిలేసి.. మరొకర్ని పెళ్లి చేసుకుంటానన్న భర్త.. భార్య ఊహించని పని చేసింది

|

Feb 22, 2021 | 5:24 PM

"నువ్వు అందంగా లేవు.. నీతో కలిసి బయటకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. నీకు విడాకులు ఇచ్చి.. ఇంకో పెళ్లి చేసుకుంటా"... ఇవి ఓ భర్త భార్యతో రోజూ అంటున్న మాటలు.

Crime News:  నల్లగా ఉన్నావ్.. వదిలేసి.. మరొకర్ని పెళ్లి చేసుకుంటానన్న భర్త.. భార్య ఊహించని పని చేసింది
woman suicide attempt
Follow us on

“నువ్వు అందంగా లేవు.. నీతో కలిసి బయటకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. నీకు విడాకులు ఇచ్చి.. ఇంకో పెళ్లి చేసుకుంటా”… ఇవి ఓ భర్త భార్యతో రోజూ అంటున్న మాటలు. ఈ వేధింపులు తాళలేక సదరు మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన నిర్మల్ జిల్లా తానూర్ మండలంలో జరిగింది. హంగీర్గ గ్రామానికి చెందిన హత్తేరావు జైభీమ్‌కు మహారాష్ట్రలోని బోకర్‌ తాలుక బేంద్రి గ్రామానికి చెందిన దీక్ష(25) అనే మహిళను ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు.

కొంతకాలంగా జైభీమ్‌ తన వైఫ్ నల్లగా ఉందని, నచ్చడం లేదంటూ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాను రెండో పెళ్లి చేసుకుంటానని ఆమెను నిత్యం వేధిస్తున్నాడు. దీంతో ఆమె తీవ్ర మనోవేధనకు గురైంది. ఈ నేపథ్యంలోనే 12వ తేదీన భార్యభర్తలిద్దరూ వ్యవసాయం పనుల కోసం పొలానికి వెళ్లారు. జైభీమ్ మంచినీళ్లు తేవడానికి వెళ్లిన సమయంలో దీక్ష క్రిమిసంహారక మందు తాగేసింది. నోటివెంట నురగలు రావడాన్ని గమనించిన తోటి కూలీలు ఆమెను వెంటనే భైంసాలోని గవర్నమెంట్ తరలించారు.

పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ ప్రథమ చికిత్స అనంతరం డాక్టర్ల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. శనివారం తెల్లవారుజామున ఆమె తనువు చాలించింది. దీక్ష తండ్రి ఉత్తమ్ కంప్లైంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read:

ఓటీటీ ఎపిసోడ్ల మాదిరిగా పోర్న్ కంటెంట్.. వారానికో ఎపిసోడ్ రిలీజ్.. విచారణలో దిమ్మతిరిగే విషయాలు

పెళ్లికి ముందే వీడియో కాల్‌లో వరుడి బాడీ పార్ట్స్ చూడాలని కోరింది.. ఖేల్ ఖతం.. ఆ వ్యక్తికి చుక్కలు