Maoist Party: హిద్మా, శారదకు క్షేమంగానే ఉన్నారు.. కీలక ప్రకటన చేసిన మావోయిస్టు పార్టీ

పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(PLGA) బెటాలియన్‌-1 కమాండర్‌ మాద్వి హిద్మా కొవిడ్‌ వైరస్‌ బారినపడ్డారు అంటూ వస్తున్న వార్తలను మావోయిస్ట్ పార్టీ ఖండించింది. ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్

Maoist Party: హిద్మా, శారదకు క్షేమంగానే ఉన్నారు.. కీలక ప్రకటన చేసిన మావోయిస్టు పార్టీ
Maoist Spokesperson Jagan

Edited By: Balaraju Goud

Updated on: Jun 28, 2021 | 7:04 PM

పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(PLGA) బెటాలియన్‌-1 కమాండర్‌ మాద్వి హిద్మా కొవిడ్‌ వైరస్‌ బారినపడ్డారు అంటూ వస్తున్న వార్తలను మావోయిస్ట్ పార్టీ ఖండించింది. ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ ఓ లేఖను విడుదల చేశారు. ఆయనతో పాటు ఛత్తీ్‌సగఢ్‌ బస్తర్‌ రీజియన్‌లో క్రియాశీలకంగా ఉన్న పలువురు అగ్ర నేతలకు కూడా వైరస్‌ సోకినట్లు వస్తున్న వార్తలు కూడా పోలీసులు చేస్తున్న ప్రచారం అని అన్నారు.

శారదా, హిద్మా ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు. పాలకులు, పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగా దృష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి విషయాలను పార్టీ అధికారికంగా ప్రకటిస్తుందని అప్పుడు మాత్రమే ప్రజలు నమ్మాలని విజ్ఞప్తి చేశారు. తాము కోవిడ్‌కు అతీతులం కామని… తాము కూడా ప్రజల మధ్య జీవిస్తున్నామన్నారు.

ఇలాంటి సమయంలో మావోయిస్టులను కూడా కరోనా వచ్చే అవకాశం లేకపోలేదని పేర్కొన్నారు. కరోనా వైరస్ సోకి కామ్రేడ్ హరిభూషన్, కామ్రేడ్ భారతక్కలు బౌతికంగా ప్రజలకు దూరమయ్యారు అని ప్రకటించారు.

మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌ భార్య జజ్జర్ల సమ్మక్క అలియాస్‌ శారద అనారోగ్యంతో బాధపడుతూ ఈ నెల 24న మృతి చెందినట్లు వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదని శారద పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు.

కరోనా వైరస్ వల్ల వందలాది ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే వారి జీవితాలకు గ్యారెంటీ ఇవ్వకుండా అధికార పార్టీలు మావోయిస్టు పార్టీని అనిచివేసేందుకు చూస్తున్నాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ తన లేఖలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: Maoists Dump: మహారాష్ట్ర సరిహద్దుల్లో భారీగా నగదు స్వాధీనం.. మావోయిస్టులకు చెందినదిగా అనుమానిస్తున్న పోలీసులు

Rave Party Case: రేవ్ పార్టీలో పట్టుబడిన బిగ్‌బాస్ మాజీ పోటీదారు.. భారీగా డ్ర‌గ్స్‌ను స్వాధీనం