Maoist Encounter: తెలంగాణ – ఛ‌త్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు.. ఓ మావోయిస్టు మృతి..

|

Aug 01, 2021 | 2:18 PM

భద్రాద్రి జిల్లా చర్ల మండలం సరిహద్దుల్లోని బోధనెల్లిప అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న స్పెషల్ పార్టీ పోలీసులకు మావోయిస్టులు ఎదురు పడ్డారు. వెంటనే అప్రమత్తమైన...

Maoist Encounter: తెలంగాణ – ఛ‌త్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు.. ఓ మావోయిస్టు మృతి..
Maoist Encounter
Follow us on

మన్యంలో మరోసారి తుపాకుల మోత మోగింది. కరోనా సమయంలో ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతాలు ఇవాళ తుపాకుల శబ్ధంతో దద్దరిల్లింది. తెలంగాణ – ఛ‌త్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఆదివారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు.  ఏజెన్సీ ప్రాంతంలో గత నెల 28 నుంచి మావోయిస్టు అమరుల వారోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర సరిహద్దులోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల పోలీస్ బలగాలు.. ఏజెన్సీ, దండకారణ్యం ప్రాంతాల్లో ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.

భద్రాద్రి జిల్లా చర్ల మండలం సరిహద్దుల్లోని బోధనెల్లిప అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న స్పెషల్ పార్టీ పోలీసులకు మావోయిస్టులు ఎదురు పడ్డారు. వెంటనే అప్రమత్తమైన స్పెషల్ పార్టీ బలగాలు మావోయిస్టులను లొంగిపోవల్సిందిగా కోరారు. ఈ క్రమంలో మావోయిస్టులు పోలీసులపైకి కాల్పులు జరిపారు. తక్షణమే అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు.

ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు హతమైనట్టు పోలీసులు తెలిపారు. పోలీసుల ధాటికి మావోయిస్టులు దట్టమైన అటవీ ప్రాంతంలోకి పారిపోయారని పోలీసులు తెలిపారు. ఈ ఎదురుకాల్పులను భ‌ద్రాద్రి కొత్త‌గూడెం ఎస్పీ సునీల్ ద‌త్ ధృవీక‌రించారు.

సరిహద్దుల్లోని చత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతగుఫా – భద్రాద్రి జిల్లా చర్ల మండలం బోదనెల్లి అటవీ ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయని ఆయన వెల్లడించారు. అయితే మృతి చెందిన మావోయిస్టుల ఎవరు అనేది తెలియ రాలేదు.

ఇవి కూడా చదవండి: How to get a Kiss: ముద్దు ఎలా పెట్టుకోవాలో ఈ కుందేళ్ల నుంచి తెలుసుకోండి.. ఈ అందమైన వీడియో చూసిన తర్వాత మీరేమంటారు..

Viral Video: అమ్మో మాములుగా లేదే.. ఆటా.. పాటతో అత్తవారింట్లో దుమ్మురేపిన కొత్త కోడలు..