Tragedy ‘పెళ్లైతే మేము విడిపోతాం.. కలిసి ఉండలేం’… కవలల ఆత్మహత్య !

|

Jul 05, 2021 | 8:26 PM

ఆ ఇంట్లో కవలలు పుట్టడంతో సంతోషాలు వెల్లివిరిశాయి. అందుకు తగ్గట్లుగానే వారిద్దరూ కలిసి మెలిసి.. ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఒకరిని ఒకరు ప్రాణంగా...

Tragedy  పెళ్లైతే మేము విడిపోతాం.. కలిసి ఉండలేం... కవలల ఆత్మహత్య !
Twins Suicide
Follow us on

ఆ ఇంట్లో కవలలు పుట్టడంతో సంతోషాలు వెల్లివిరిశాయి. అందుకు తగ్గట్లుగానే వారిద్దరూ కలిసి మెలిసి.. ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఒకరిని ఒకరు ప్రాణంగా చూసుకునేవారు. ఈ క్రమంలో  పెళ్లి ఈడు రానే వచ్చింది. వారిద్దరికీ మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసి అత్తారిళ్లుకు పంపాలని తల్లిదండ్రులు అనుకున్నారు . అయితే.. ‘పెళ్లైతే మేము విడిపోతాం.. కలిసి ఉండలేం’ అని కలవరపడ్డ ఆ కవలలు ఎవరూ ఊహించని విధంగా బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక మండ్య జిల్లా శ్రీరంగపట్నం మండలం, హనసనహళ్లి గ్రామానికి చెందిన దీపిక, దివ్య(19) కవలలు. అయితే వారికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు సంబంధాలు వెతకడం ప్రారంభించారు. అదే జరిగితే తమ బంధం తెగిపోతుందని.. తాము ఇక కలిసుండటం కుదరదని భావించిన కవలలు శనివారం సాయంత్రం ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై అరికేర్​ స్టేషన్​లో పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు జరుపుతున్నారు.

 

ఓనర్‌ ఇంటికే కన్నం వేసిన పనిమనిషి…

నమ్మి పనిలో పెట్టుకున్నందుకు ఓనర్ ఇంటికే కన్నం వేసింది ఓ పనిమనిషి. నమ్మకంగా ఉంటుందని వారు ఆమెను ఇంట్లో మనిషిలానే చూసుకున్నారు. బయటకు వెళ్లేటప్పడు బీరువాకు ఓనర్ తాళం వేయడం మర్ఛిపోయారు. గమనించిన ఆమె ఇదే అదునుగా భావించి దొంగతనానికి పాల్పడింది. హైదరాబాద్​లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కేపీహెచ్​బీ కాలనీ తొమ్మిదో ఫేజులో నివసించే పోచంపల్లి కిషన్ రావ్… మార్చిలో భూమి అమ్మగా వచ్చిన 40 లక్షల రూపాయలను బీరువాలో దాచి ఉంచాడు. పనిమనిషి సావిత్రి… ఆ డబ్బులపై కన్నేసింది. అంతే సరైన సమయం కోసం ఎదురు చూసి వీలు చిక్కగానే.. యజమాని బీరువాకు తాళం మరచిన సమయంలో డబ్బులు కోట్టేసింది. గత నెల 30న ఇంట్లో ఉన్న డబ్బులను యజమాని లెక్కించగా… 15లక్షల 50 వేల మాత్రమే ఉండటం చూసి షాకయ్యాడు. పనిమనిషిపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమదైన శైలిలో పోలీసులు విచారించగా.. ఆమెనే డబ్బులు తీసినట్లు ఒప్పుకుంది.

Also Read: కేబినెట్ విస్తరణలో జనసేనకి ఛాన్స్.. క్లారిటీ ఇచ్చేసిన నాదేండ్ల మనోహర్

దొంగతనానికి వచ్చిన దొంగ.. లోపలికి వెళ్లేందుకు అవకాశం లేక.. ఏం ఎత్తుకెళ్లాడో తెలిస్తే షాక్ అవుతారు.!