చావు బతుకుల మధ్య మనస్విని.. పరిస్థితి విషమమంటున్న డాక్టర్లు

ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడ్డ మనస్విని ప్రస్తుతం చావు బతుకుల మధ్య నలిగిపోతుంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ఐదు గంటలకు పైగా ఆపరేషన్ నిర్వహించామని.. మరో రెండు రోజులు గడిస్తే కానీ మనస్విని పరిస్థితి గురించి చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు. గొంతు వద్ద చాలా లోతుగా కత్తి దిగిందని.. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు వెల్లడించారు. అయితే మంగళవారం ఉదయం దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ లాడ్జీకి నిందితుడు వెంకటేశ్, బాధితురాలు మనస్విని వెళ్లారు. అక్కడ మధ్యాహ్నం […]

చావు బతుకుల మధ్య మనస్విని.. పరిస్థితి విషమమంటున్న డాక్టర్లు

Edited By:

Updated on: Jul 10, 2019 | 4:15 PM

ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడ్డ మనస్విని ప్రస్తుతం చావు బతుకుల మధ్య నలిగిపోతుంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ఐదు గంటలకు పైగా ఆపరేషన్ నిర్వహించామని.. మరో రెండు రోజులు గడిస్తే కానీ మనస్విని పరిస్థితి గురించి చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు. గొంతు వద్ద చాలా లోతుగా కత్తి దిగిందని.. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు వెల్లడించారు.

అయితే మంగళవారం ఉదయం దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ లాడ్జీకి నిందితుడు వెంకటేశ్, బాధితురాలు మనస్విని వెళ్లారు. అక్కడ మధ్యాహ్నం సమయంలో ఆమెపై దాడి చేశాడు వెంకటేశ్. ఆ తరువాత అతడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. విషయం తెలుసుకొని వెంటనే అప్రమత్తమైన లాడ్జీ నిర్వహాకులు ఆమెను ఓమ్నీ ఆసుపత్రికి, అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.